Urfi Javed: ఇలాంటి డ్రెస్ ఎప్పుడన్నా చూశారా.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే.. పరువాల వడ్డనకు ఇదో దారి!

Urfi Javed blue cut-out dress viral: హిందీ బిగ్ బాస్ షో  మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్  వేసుకునే బట్టల గురించి అటు బాలీవుడ్ లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 09:30 AM IST
  • వింత బట్టలతో వార్తల్లోకి ఉర్ఫీ జావేద్

    చర్చనీయాంశంగా మారిన బ్లూ కటౌట్ డ్రెస్

    రకరకాల ట్రోల్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు

 Urfi Javed: ఇలాంటి డ్రెస్ ఎప్పుడన్నా చూశారా.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే.. పరువాల వడ్డనకు ఇదో దారి!

 Urfi Javed blue cut-out dress viral: తెలుగు వారికి ఉర్ఫీ జావేద్ అంటే పెద్దగా పరిచయం లేదు. కానీ కాస్త హిందీ బిగ్ బాస్ షో ఫాలో అయ్యే వారికి ఆమె ఎవరో తెలుసు. గత ఏడాది హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగ లేకపోయినా ఈ భామ బయటకు త్వరగా వచ్చేసింది. అయినా సరే బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుని మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 

ఉర్ఫీ ధరించే బట్టల గురించి ఎప్పటికప్పుడు బాలీవుడ్లో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా బట్టలు డిజైన్ చేసుకుంటుందో లేక  ఎవరైనా డిజైనర్లతో డిజైన్ చేయించుకుంటుందో తెలియదు కానీ ఆమె వేసుకునే బట్టలు ప్రపంచంలో ఆమె దగ్గర తప్ప మరి ఇంకెక్కడా చూడలేమేమో. ఆమె వేసుకునే బట్టల గురించి అటు బాలీవుడ్ లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. 

ఆమె బట్టలు చూసి ఆశ్చర్యపోయే వారు కొందరైతే ఇదేం పోయేకాలం ఇలాంటి బట్టలు వేసుకుని రోడ్డు ఎక్కుతుంది అని తిట్టుకునేవారు కొందరు ఉంటారు. తాను మాత్రం ఈ అందాల ఆరబోతలో వెనక్కి తగ్గేది లేదని ఆమె ఎప్పటికప్పుడు రకరకాల డ్రస్సులతో రెచ్చిపోతూ ఉంటుంది. ఆ మధ్య ఇదే విషయాన్ని ఆమెను అడిగితే సమంత ఇలాంటి డ్రస్సులు వేసుకుంటే ఆమెను మాత్రం అడగరు కానీ నేను అంత తేరగా దొరికాను కదా అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయింది కూడా. 

తాజాగా ఆమె ఒక బ్లూ కలర్ కటౌట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో కనువిందు చేసింది. ఎద భాగం కనిపించి కనిపించకుండా తొడలు మొత్తం కనిపించే విధంగా డిజైన్ చేసుకున్న ఆ డ్రెస్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అదేదో సినిమాలో కిటికీల జాకెట్టు అని మన కమెడియన్లు ఒక జాకెట్టు సృష్టించిన విధంగా ఆమె కిటికీల గౌను వేసుకుంది. ఆ కిటికీల గుండా ఉదర భాగమంతా కనిపించే విధంగా ఆ డ్రెస్ డిజైన్ చేసుకుంది. 

ఆమె డ్రస్ మీద రకరకాల కామెంట్లు వినిపిస్తున్న క్రమంలో దానికి ఆమె తన వీడియోకి ఆసక్తికర క్క్యాప్షన్ కూడా జోడించింది. కాస్త ఆత్మనూన్యత భావంతో ఉన్న వారిని కంట్రోల్ చేయడానికి చూసే ఈ సొసైటీలో నేను ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకుంటే మమ్మల్ని అడగమని,  ఇలా చిరిగిన బట్టలు వేసుకోవద్దని ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. 

Also Read: Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ హాట్ షో.. అంతా కనపడేలా వీధుల్లో చక్కర్లు!
Also Read:  Sravanthi Chokkarapu: హద్దులు దాటేస్తున్న స్రవంతి చొక్కారపు.. లోదుస్తుల్లో కళ్ళు చెదిరే ఫోటోషూట్... దాని మీదే కన్నేసిందా?

 
 
 
 
 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News