Ram Gopal Varma - Rajinikanth: సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆర్జీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1995లో బాలీవుడ్ లో తెరకెక్కించిన మొదటి చిత్రం రంగీలా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఊర్మిళ మటొండ్కర్, జాకీశ్రాఫ్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో వీరి ముగ్గురిని తీసుకోవడాని కంటే.. ముందు ఇంకొక ముగ్గురిని సినిమాలో తీసుకోవాలని అనుకున్నారట రామ్ గోపాల్ వర్మ.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించగా.. ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతుంది. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ గురించి పూర్తి చేసేటప్పుడు తెలుగులో శ్రీదేవి, నాగార్జునతో తీయాలనుకున్నాను. ఇందులో రజినీకాంత్ అతిధి పాత్రలో చూపించాలనుకున్నాను. అయితే అటు శ్రీదేవి ఇటు నాగార్జున ఇద్దరూ కూడా కథను రిజెక్ట్ చేశారు అందుకే నా దగ్గర ఉన్న మరో కథను తీసుకొని గోవిందా గోవిందా అనే సినిమా తీశాను అంటూ తెలిపారు రాంగోపాల్ వర్మ.
యాక్షన్ చిత్రాలలో రాంగోపాల్ వర్మ బెటర్ అని నాగార్జున, శ్రీదేవి భావించారని ఆ చిత్ర నిర్మాత వెల్లడించారు . అంతేకాదు తన చిత్రం రంగీలా వాస్తవ సంఘటన నుండి ప్రేరణ పొందినా.. ముఖ్యంగా ఈ చిత్ర ఆలోచన ఇరానీ కేఫ్ లో పుట్టిందని ఆయన తెలిపారు.. ముఖ్యంగా రంగీలా చిత్రానికి రాంగోపాల్ వర్మ సహా రచయితగా దర్శకుడుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.
రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ సెలబ్రిటీలైన అమీర్ ఖాన్, ఊర్మిళ మటొండ్కర్, జాకీశ్రాఫ్ లను తీసుకున్నారు ఈ చిత్రం యొక్క కథాంశం ప్రముఖ నటుడు మిలీ యొక్క ఆశయం చుట్టూ తిరుగుతుంది చివరికి ప్రముఖ నటుడు రాజ్ కమల్ మరియు ఆతన చిన్ననాటి స్నేహితుడు మున్నా ఇద్దరు ఒక అమ్మాయితో ప్రేమలో పడడంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి దారితీస్తుంది.
ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఊర్మిల కెరియర్ కు ఈ సినిమా చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక రాంగోపాల్ వర్మ చివరిగా వ్యూహం చిత్రానికి దర్శకత్వం వహించారు.
Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.