Ramgopalpet police issued notice to allu arjun: పుష్ప2 మూవీ ప్రీమియర్ రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసందే. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో వెంటిలెటర్ మీద చికిత్స పొందుతున్నాడు.
అయితే.. పుష్ప2 తొక్కిసలాట నేపథ్కంలో.. పోలీసులు మొత్తంగా 18 మందిపై కేసుల్ని నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అనేక నాటకీయ పరిణామలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ ఘటనపై మాట్లాడారు. అల్లు అర్జున్ సిని పెద్దలు వరుస పెట్టి వెళ్లి పరామర్శించడంను కూడా తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తొంది.
మొత్తంగా ఈ ఘటన మాత్రం ఇండస్ట్రీపరంగా, రాజకీయంగాకూడా హట్ టాపిక్ గా మారింది. అయితే..అల్లు అర్జున్ కు ఇటీవల నాంపల్లి కోర్టు బెయిల్ ను ఇచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయనను ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ కు వెళ్లి సంతకం చేయాలని కూడా ఆదేశించింది.
Read more: Pawan kalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఇద్దరు యువకుల దుర్మరణం ఘటన.. పవన్ కళ్యాణ్ భారీ సాయం..
ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇటీవల శ్రీతేజ్ ను పరామర్శించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా...రామ్ గోపాల్ పేట పోలీసులు.. అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ కిమ్స్ కు వెళ్లి శ్రీతేజ్ ను కలిసే అవకాశం ఉంటే.. ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీచేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter