Megastar Chiranjeevi: మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో రమ్యకృష్ణ ఫిక్స్ ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Sep 29, 2020, 11:19 PM IST
    • టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
    • ప్రస్తుతం సందేశాత్మక చిత్రాలు తీసి కమర్షియల్ హిట్ సాధించే కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య మూవీలో నటిస్తున్నారు.
    • ఈ మూవీలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో రమ్యకృష్ణ ఫిక్స్ ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సందేశాత్మక చిత్రాలు తీసి కమర్షియల్ హిట్ సాధించే  కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ( Ram Charan ) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆచార్య తరువాత చిరంజీవి, మెహర్ రమేష్ తో ఒక చిత్రం, వివి వినాయక్ తో మరో చిత్రానికి అంగీకరించారు.

ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

చెల్లి పాత్ర కీలకం

ఇందులో వివి వినాయక్ ప్లాన్ చేస్తున్న చిత్రం ఒక రీమేక్ మూవీ. మలయాళంలో భారీ విజయం సాధిచించిన లూసిఫర్ మూవీని ఆయన తెలుగులో తెరకెక్కించనున్నారు. తెలుగు నేటివిటీని బట్టి మూవీని ప్లాన్ చేస్తున్నారట వినాయక్. లూసిఫర్ మూవీలో చెల్లిపాత్ర కీలకం. ఈ పాత్ర చేయడానికి మెగాస్టార్ చిరంజీవి పాత్రకు చెల్లి రోల్ కోసం సీనియర్ స్టార్ రమ్యకృష్ణ ( Ramya Krishna ) ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

పాత్రకు న్యాయం

లూసిఫర్ మలయాళం వర్షన్ లో మంజూ వారియర్ ఈ పాత్రను అద్భుతంగా న్యాయం చేశారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు కొనసాగే ఈ పాత్రను వివి వినాయక్ రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని వినాయక్ భావిస్తున్నారట. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. అయితే చిరంజీవి, రమ్యకృష్ణ కలిసి కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ లో కనిపించారు. మరి ఇప్పుడు అన్నా చెల్లెలి పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు.  

ALSO READ|  Allu Arjun: పుష్ప కోసం పులితో ఫైట్..అల్లు అర్జున్ మెగా రిస్క్

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News