Rana Daggubati: సంక్రాంతికే రానా సినిమా విడుదల

టాలీవుడ్ (Tollywood) హీరో రానా లీడ్ రోల్‌లో మూడు భాషల్లో విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘అర‌ణ్య’గా హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల కానుంది.

Last Updated : Oct 21, 2020, 05:01 PM IST
Rana Daggubati: సంక్రాంతికే రానా సినిమా విడుదల

Rana Daggubati Movie coming to Makar Sankranthi: టాలీవుడ్ (Tollywood) హీరో రానా లీడ్ రోల్‌లో మూడు భాషల్లో విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘అర‌ణ్య’గా హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల కానుంది. కరోనావైరస్ (Coronavirus) లాక్‌డౌన్ కారణంగా సుదీర్ఘ కాలంపాటు నిలిచిపోయిన దగ్గుబాటి రానా (Rana Daggubati) సినిమా 2021 సంక్రాంతి ( Makar Sankranti ) కి విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రానానే ట్విట్టర్ వేదికగా ద్వారా వెల్లడించాడు. 

ఈ మేరకు రానా బుధవారం అరణ్య సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తూ.. రానా ఒక వీడియోను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఒక సందేశాన్ని సైతం పోస్ట్ చేశాడు. కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటం.. మ‌న అడ‌వులు చాలా కాలంగా జ‌రుగుతున్న మాన‌వ విధ్వంసంపై పోరాడుతున్నాయ‌ని తెలియజేస్తుంది. ఇది ఎప్పటికల్లా ఆగుతుంది. కాదాన్‌తో ప్ర‌జ‌ల్లో ఈ విషయంపై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం.. అర‌ణ్య సినిమా 2021 సంక్రాంతి కానుక‌గా మీ దగ్గరున్న థియేటర్లల్లో మాత్రమే విడుద‌ల‌ కానుంది.. అంటూ రానా ట్వీట్ చేశాడు. అయితే మానవుల మనుగడ, స్వార్థం కోసం అడవుల ఆక్రమ‌ణ‌, సహజ వనరులను నాశనం తదితర అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రభు రూపొందించారు.  Also read: F2 Movie: ‘ఎఫ్ 2’ సినిమాకు జాతీయ అవార్డు

అయితే . రానా లీడ్ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రం ప్రభు సాలోమోన్ (Prabhu Solomon) డైరెక్ష‌న్‌లో దాదాపు 99శాతం రూపుదిద్దుకుంది. అయితే ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ (Eros International ) నిర్మిస్తోంది. ఈ సినిమాలో రానాతోపాటు జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్, విష్ణు విశాల్ కీల‌క‌పాత్రల్లో పోషించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2 దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడింది. Also read: Navratri Day 5: సరస్వతీ నమోస్తుతే.. చదువుల తల్లి అలంకరణలో అమ్మవారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News