కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా సినిమాలు థియేటర్లు తెరిచే వరకు ఆగకుండా డిజిటల్ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడం అనేది క్రమక్రమంగా టాలీవుడ్‌లో సాధారణ ధోరణిగా మారుతోంది. ఐతే కొంతమంది హీరోలకు, చిత్రనిర్మాతలకు మాత్రం వారి సినిమాలను OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు.
రానా దగ్గుబాటి నటిస్తున్న ‘విరాట పర్వం’ ( Rana Daggubati's Virataparvam ) సినిమా కూడా అటువంటిదే. OTT ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంతో రానాకు మంచి సంబంధాలు అలాగే పరిచయాలు కూడా ఉన్నాయని ఫిలింనగర్ టాక్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమా ( Krishna and his leela ) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా విడుదలైంది. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసినందుకు ఆ యాజమాన్యం రానాకు కృతజ్ఞతలు కూడా తెలిపింది. అలాగే రానా తదుపరి చిత్రం అయిన 'విరాట పర్వం' సినిమా డిజిటల్ హక్కులను పొందడానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. Also read : Actor Vishals Chakra Movie: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు రూ.8 కోట్ల షాక్!
ఐతే, ఈ ప్రతిపాదనను విరాటపర్వం చిత్ర నిర్మాతలు తిరస్కరించారు. ‘విరాట పర్వం’ సినిమా థియేటర్‌లలో మాత్రమే విడుదల అవుతుందని దర్శకుడు వేణు ఉడుగుల ( Director Venu Udugula ) వెల్లడించాడు. "ఈ సినిమాని థియేటర్లలో మాత్రమే విడుదల చేయడానికి ఎన్ని నెలలు అయినా వేచి ఉంటాము కాని ఓటిటిలో మాత్రం విడుదల చేయదల్చుకోలేదు" అని విరాటపర్వం మేకర్స్ తేల్చిచెప్పారు.
వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాట పర్వం’ సినిమాలో రానా నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి ( Rana Daggubati ) సరసన సాయి పల్లవి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి, నందిత దాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని ఈ చిత్ర యూనిట్ భావిస్తోంది. Also read : Kajal Aggarwal wedding: కాజల్ అగర్వాల్ పెళ్లి వాయిదా