Ranasthali Movie Review : తెలుగు రా అండ్ రస్టిక్ 'రణస్థలి' మూవీ ఎలా ఉందంటే?

Ranasthali Movie Review : తెలుగులో రా అండ్ రస్టిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది రణస్థలి మూవీ, సినిమా టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేయడంతో సినిమా మీద బజ్ ఏర్పడింది. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.   

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 26, 2022, 03:48 PM IST
Ranasthali Movie Review : తెలుగు రా అండ్ రస్టిక్ 'రణస్థలి' మూవీ ఎలా ఉందంటే?

Ranasthali Telugu Movie Review : ఈ మధ్యకాలంలో సినిమాలు చిన్నవా, పెద్దవా అని ప్రేక్షకులు ఏ మాత్రం చూడడం లేదు. సినిమా పెద్దదైనా చిన్నదైనా కంటెంట్ ఉంటే ఆదరించేందుకు వెనకాడడం లేదు. ఇప్పటికే తెలుగులో కూడా అనేక విభిన్నమైన చిన్న సినిమాలు ప్రేక్షకులను అందించే ప్రయత్నం చేస్తున్నారు. 

అందులో భాగంగానే ఈరోజు రణస్థలి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనుపమ సూరెడ్డి నిర్మించిన ఈ 'రణస్థలి'ని పరశురామ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. నీల మాధవ ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావు.. లు హీరోయిన్లుగా   ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
 
రణస్థలం కథ ఏమిటంటే?
తల్లి లేని బసవ(నీల మాధవ ధర్మ)ని అతని తండ్రి(సమ్మెట గాంధీ) అల్లారుముద్దుగా పెంచుతూ మంచి చదువు చదివిస్తాడు. తనకు మరదలు వరుసయ్యే అమ్ములు(చాందిని)తో వివాహం కూడా జరిగిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో అమ్ములు మరణిస్తుంది. దీంతో అమ్ములు మరణానికి కారణమైన వారందరినీ మట్టుపెట్టాలని బసవ నిర్ణయం తీసుకుంటాడు.

అందుకోసం ఇంటికి కూడా రాకుండా అడవిలోనే కాపు కాస్తూ తన భార్య ప్రేమకు గుర్తు కారణమయిన అందరినీ ఎలా మట్టుపెట్టాడన్నది సినిమా కధ. బసవ భార్య అసలు ఎలా మరణించింది? ఆమె మరణానికి కారణం ఎవరు? వారి మరణాన్ని బసవ ఎలా ప్లాన్ చేశాడు? బసవకు అసలు ఈశ్వరి(అమ్ము అభిరామి) ఏమవుతుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ
తెలుగులో ఎన్నో రివెంజ్ డ్రామా సినిమాలో వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి . అలాంటి వాటిలో ఈ రణస్థలి కూడా ఒకటిగా నిలుస్తుంది. ఎంతో అపురూపంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతి కిరాతకంగా చంపిన హంతక ముఠాని ఒక సాదాసీదా వ్యక్తి ఎలా మట్టుబెట్టాడు అన్నదే రణస్థలి కధ. పాయింట్ పరంగా చెప్పుకుంటే ఇలా సింపుల్ గానే ఉన్నా కధ విషయంలో మాత్రం దర్శకుడు చాలా తెలివిగా ప్రేక్షకులందరికీ థియేటర్లో సీట్లకే అతుక్కునేలా చేయగలిగాడు.

చిన్నచిన్న లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి కానీ ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేయడంలో దాదాపుగా సినిమా టీం సక్సెస్ అయింది. దానికి తోడు సినిమా ఆద్యంతం ఒక అడవి లాంటి లొకేషన్ లో చేయడం కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అంటే అడవి అందాలను చూపించారని కాదు కేవలం సిటీ కల్చర్ సిటీ లైఫ్ మాత్రమే చూపిస్తున్న నేటి తరుణంలో విలేజ్ లైఫ్ విలేజ్, కల్చర్ ఎలా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేయడం అభినందనీయం. అయితే కొన్ని కొన్ని లోపాలు సంగతి పక్కన పెడితే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది.
 
నటీనటులు 
ఈ సినిమాలో బసవ పాత్రలో నటించిన నీల మాధవ ధర్మ తన నటనతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా అమ్ములు పాత్రలో నటించిన తెలుగు అమ్మాయి చాందిని రావు, ఈశ్వరి పాత్రలో నటించిన అమ్ము సహా ఇతర కీలక పాత్రలలో నటించిన అందరూ తమ పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో సమ్మెట గాంధీ కీలక పాత్రలో నటించారు. ఆయన సినిమా మొత్తాన్ని తన వాయిస్ తోనే నడిపించారు. ఇక సినిమాలో నటించిన మిగతా నటీనటులు అందరూ కొత్తవారే అయినా అనుభవం ఉన్నవారిలా నటించి ఆకట్టుకున్నారు. 
 
టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు కొత్తవాడే అయినా ఆ టెన్షన్ ఎక్కడ సినిమాలో కనిపించలేదు. అనుభవం ఉన్న దర్శకుడిలాగే సినిమా మొత్తాన్ని తీర్చిదిద్దాడు. చిన్న చిన్న లోపాలు సంగతి పక్కన పెడితే సినిమా అయితే దర్శకుడి ప్రతిభకు పట్టం కడుతుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలో కొన్ని సాంగ్స్ కి అందించిన సంగీతం.

అదేవిధంగా నేపథ్య సంగీతం చాలా సన్నివేశాల్లో సినిమాకి బాగా ప్లస్ అయ్యే విధంగా సాగింది ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో నేపధ్య సంగీతం బాగా కుదిరినట్టే చెప్పాలి. ఇంకా ఈ సినిమా ఫైట్ మాస్టర్స్ కూడా తమదైన శైలిలో ఫైట్స్ డిజైన్ చేశారు. రక్తపాతం ఎక్కువే అందుకే భయం కల్పించేలా ఈ ఫైట్స్ సాగాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టే ఉన్నాయి. 

Rating: 2.75/5

ఫైనల్ గా 
ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఆద్యంతం ట్విస్టులతో సాగుతుంది. రక్తపాతం ఇష్టపడని వారు పక్కన పెట్టచ్చు కానీ సస్పెన్స్, రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడే వారంతా చూసి ఆనందించదగిన మూవీ ఇది.
Also Read: Mahesh Babu Hair: తల్లిదండ్రులు మరణించినా తలనీలాలు తీయని మహేష్.. బాధ్యత లేక కాదు అసలు కారణం ఇది!

Also Read: Mahesh babu Depression: తీవ్ర డిప్రెషన్లో మహేష్, ఎవరితో మాట్లాడడం లేదు, కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News