CBFC CEO: సీబీఎస్సీ సీఈవో సస్పెండ్... యానిమల్ సినిమానే కారణమా

Animal Controversy: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన అరుదైన చిత్రాల జాబితాలో ఈ చిత్రం స్థానం సంపాదించింది. ఇప్పటిదాకా 6 చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. కానీ అలాంటి ఈ సినిమాకి ప్రశంసలతో పాటు ఎన్నో విమర్శలు కూడా తప్పడం లేదు…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 10:29 AM IST
CBFC CEO: సీబీఎస్సీ సీఈవో సస్పెండ్... యానిమల్ సినిమానే కారణమా

CBFC CEO Animal Controversy: ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాకైనా విమర్శించేవారు క్రిటిక్స్ ఉంటారు.  సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టుగా కాకుండా దానివల్ల చూసే ప్రేక్షకులు ప్రభావితం అవుతారని విమర్శించే వారు ఎంతోమంది ఉంటారు. అందుకే దర్శకులు.. ఎన్నో రూల్స్ మధ్య తమ సినిమాలను తెరకెక్కించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తూ ఉంటారు.
 అందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన ‘యానిమల్’ గురించి ప్రేక్షకులంతా మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందులోని పలు సీన్స్ మాత్రం కాంట్రవర్సీలకు, చర్చలకు దారితీశాయి.

రాజ్యసభలో కూడా ఈ సినిమా గురించి చర్చ సాగింది అంటే ఈ చిత్రం చుట్టూ ఉన్న వారిని ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం గురించి ఒక పెద్ద కాంట్రవర్సీ సోషల్ మీడియాలో చర్చగా మారింది.

సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీఈఓ రవీందర్ భాకర్‌ని ఆ పదవి నుంచి తొలగించి స్మితా వత్స్ శర్మ ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. కాగా ఆయన్ని తొలగించడానికి కారణం యానిమల్ సినిమా అని తెలుస్తుంది. తమిళ హీరో విశాల్ తన చిత్రం మార్క్ ఆంటోని విడుదలకు ముందు బోర్డుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలను మోపారు. ఓక రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్‌ క్రియేట్ చేసిన విమర్శలతో భాకర్ తొలగింపు ఖచ్చితం అయిపోయిందని తెలుస్తోంది.

హింస.. కొన్ని అసభ్యకర సన్నివేశాలతో.. స్త్రీ ద్వేషపూరితమైన చిత్రం గా ఉన్న యానిమల్ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్‌ను ఎలా అనుమతించగలదనే ప్రశ్నలు తలెత్తాయి. A సర్టిఫికేట్ ఇవ్వడం.. అభ్యంతరకరమైన సన్నివేశాలను కత్తిరించకపోవడం, ముఖ్యంగా మహిళలపై కొన్ని అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించడం వల్ల.. వివాదం ముదిరింది.  ఇక దీనివల్లనే సీబీఎస్సీ సీఈఓ ని తొలగించారు అని వినిపిస్తోంది.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News