Ravi Teja's Ravanasura: రావణాసుర ఫలితాన్ని ఏమాత్రం ఊహించని రవితేజ.. అందుకే సొంతంగా..?

Ravanasura Movie Collections: రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా ఆయన ఈ సినిమా రిజల్ట్ గురించి ఏమాత్రం ఊహించలేదని అంటున్నారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 15, 2023, 11:00 AM IST
Ravi Teja's Ravanasura: రావణాసుర ఫలితాన్ని ఏమాత్రం ఊహించని రవితేజ.. అందుకే సొంతంగా..?

Ravi Teja didn't expected Ravanasura Failure: రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటే అంచనాలను అందుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమాకి మొదటి ఆర్డర్ నుంచే మిశ్రమ స్పందన లభించింది.

ఈ నేపథ్యంలోనే మొదటి వీకెండ్ లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. ఇక వీక్ డేస్ లో సోమవారం మొదలు మంగళవారం కూడా పెద్దగా కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. ఈ సినిమాని రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్ట్ చేయగా ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. అను ఇమ్మానుయేల్, దక్ష నగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ వంటి వారు ఈ సినిమాలో నటించగా సినిమా ఏ మాత్రం అంచనాలను అందుకో లేకపోయినా నేపథ్యంలో కలెక్షన్స్ లో కూడా జోరు చూపించలేకపోయింది.

అయితే ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లో ఉన్న రవితేజ ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ నామాను ఈ సినిమాని బయట వారికి అమ్మ వద్దని చెప్పి సొంతంగా రిలీజ్ చేయాలని కోరారు రవితేజ. హీరో అంత బలంగా చెప్పడంతో నిర్మాత అభిషేక్ కూడా బయట వారికి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకుండా సొంత రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Nani Movie Fees: దసరా దెబ్బ..'బాంచత్' అనిపించేలా ఫీజు.. ఎన్ని కోట్లు పెరిగిందంటే?

కానీ సినిమా రిలీజ్ చేసిన తర్వాత పరిస్థితి చూస్తే ఏమాత్రం వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు. అలా రవితేజ స్వయంగా సొంతంగా రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమా ఆయన అంచనాలను ఫెయిల్ అయ్యేలా చేసిందని అంటున్నారు. మొత్తం మీద ధమాకా, వాల్తేరు వేరే వంటి సినిమాలతో హిట్ల అందుకున్న రవితేజ ఈ సినిమాతో మాత్రం డిజాస్టర్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Sree Leela Fees: శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా?.. వామ్మో అనాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News