Tillu Square: ప్రతి సంవత్సరం సంక్రాంతి లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మహేష్ బాబు గుంటూరు కారం ..వెంకటేష్ సైంధవ్ ..నాగార్జున నా సామిరంగా.. సంక్రాంతి సీజన్ ని లాక్ చేసుకోగా.. యువ హీరో తేజ కూడా కథ పైన నమ్మకంతో హనుమాన్ చిత్రంతో ఈ సంక్రాంతికి మన ముందుకి రాబోతున్నారు.
ఇక వీటన్నింటితో పాటు నిన్నటి వరకు రవితేజ హీరోగా చేసిన ఈగల్ సినిమా కూడా సంక్రాంతికి రావడానికి సిద్ధంగా ఉండింది. దీంతో అందరి పరిస్థితి అయోమయంలో పడినట్టు అయింది. అసలు ఇన్ని చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయా.. ఎందుకు అందరూ ఇంత ముందుగా ప్రవర్తిస్తున్నారు అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక ఈ కాంపిటేషన్ తట్టుకోకుండా ఒకరైన వెనకడుగు వేస్తారేమో అని చూడ సాగారు. కానీ నిన్నటి వరకు అందరూ తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తించారు. అయితే అప్పుడు ఇప్పుడు మాత్రం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’ పోస్టుపోన్ అవుతుంది అని వార్తలు సాగాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ నిన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్లో దిల్ రాజు అఫీషియల్ గా ఈగల్ సినిమా వాయిదా వార్తని తెలియజేశారు.
ఈగల్ చిత్రం జనవరి 13న రిలీజ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు విడుదలవుతున్న చిత్రాలు అన్ని రెండు రోజులు వ్యవధిలోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఎవరో ఒకరి తప్పుకుంటే సినిమాల థియేటర్స్ విషయంలో అందరికి మంచిదని.. ఇటీవల దిల్ రాజు ఆయా సినిమాల నిర్మాతలతో ఓ సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా నేడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అన్ని సినిమాల మంచి కోసం అలోచించి రవితేజ, ఈగల్ చిత్ర నిర్మాతలు.. తమ సినిమాని వెనక్కి తీసుకు వెళ్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.
ఇక ఈ మీటింగ్ లోనే ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో కూడా చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే వెనక్కి తగ్గిన సినిమాకి సోలో డేట్ ఇస్తామంటూ రవితేజ చిత్రానికి గుడ్ న్యూస్ కూడా నిర్మాతల కౌన్సిల్ ప్రకటించడం విశేషం.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఫిబ్రవరి 9న రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్రాలను పోస్టుపోన్ చేయించేలా నిర్మాత మండలి భాద్యత తీసుకుంది. కాగా ఫిబ్రవరి 9న సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2, అలానే యాత్ర 2 రిలీజ్ లు ఉన్నాయి. డీజే టిల్లు 2 నిర్మిస్తున్న నాగవంశీ ఈ సంక్రాంతి రేసులో గుంటూరు కారంతో ఉండడంతో.. టిల్లు 2ని వాయిదా వేయడానికి వెంటనే ఒప్పుకున్నట్లు నిర్మాత మండలి తెలియజేసింది.
ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నా.. ఈ సంక్రాంతి విడుదల వల్ల ఆఖరికి నష్టపోయింది సిద్దు జొన్నలగడ్డ అంటూ కామెంట్లు పెడుతున్నారు సినీ అభిమానులు. ఫిబ్రవరి 9 అన్ని లెక్కలు చూసుకుని మరీ సిద్దు జొన్నలగడ్డ విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్నారట. ఇప్పుడు ఈ సంక్రాంతి పోటీల వల్ల.. సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు నష్టపోకపోయినా.. లాస్ట్ కి ఆ ప్రభావం సిద్దు జొన్నలగడ్డ పైన పడి ఆయన సినిమా పోస్ట్ పోన్ అయ్యేలా చేసింది. మరి ఇక మన టిల్లు 2 డేట్ ఎప్పటికి పోస్ట్ పోన్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook