Ravi Teja : షూట్లో ప్రమాదం.. గాయాలపాలైనా వెనక్కి తగ్గని మాస్ మహారాజా..వాటే డెడికేషన్!.

Ravi Teja injured in Tiger Nageswara Rao sets : వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న మాస్ మహారాజా  రవితేజకి సంబంధించిన ఒక షాకింగ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో రవితేజకు గాయాలయ్యాయని తెలుస్తోంది.

Last Updated : Jun 16, 2022, 01:16 PM IST
  • రవితేజకు గాయాలు
  • టైగర్ నాగేశ్వరరావు షూట్లో ప్రమాదం
  • అయినా వెనక్కు తగ్గని రవితేజ
Ravi Teja : షూట్లో ప్రమాదం.. గాయాలపాలైనా వెనక్కి తగ్గని మాస్ మహారాజా..వాటే డెడికేషన్!.

Ravi Teja injured : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే రవితేజకి సంబంధించిన ఒక షాకింగ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ విషయం గురించి తెలుసుకున్న అభిమానులు అయితే కాస్త టెన్షన్ పడుతున్నారు.. మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు లైన్ లో పెట్టి ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతానికి టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రోప్ స్కిడ్ కావడంతో రవితేజకు గాయాలయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆయనకు కుట్లు కూడా పడ్డాయి అని అంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకున్న ఆయన మళ్లీ నేటి నుంచి అంటే జూలై 17 వ తేదీ నుంచి టైగర్ నాగేశ్వరరావు షెడ్యూల్ షూట్ ప్రారంభించారని తెలుస్తోంది. 

దానికి కారణం ఈ సినిమా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డేట్స్ మళ్ళీ దొరకక పోవడమే అని తెలుస్తోంది. ఆయన మిస్ అయితే మళ్ళీ కొన్ని రోజుల పాటు నిర్మాత ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో రవితేజ ముందుకు వచ్చి మరీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కాకుండా రవితేజ మరిన్ని సినిమాలు చేస్తున్నారు. రామారావు ఆన్ ద్యూటీ, రావణాసుర, ధమాకా, వంటి సినిమాలు చేస్తున్నారు. ఇక ఖిలాడీ సినిమాకు రైటర్ గా పని చేసిన శ్రీకాంత్ విస్సా నుంచి ఆయన దాదాపు అయిదు కథలను సింగిల్ పేమెంట్ ఇచ్చి కనుక్కున్నారు అనే ప్రచారం జరుగుతోంది. 

అవసరమైతే దర్శకుడిని తానే వెతుక్కుని ఎలా అయినా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవాలని రవితేజ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తమ అభిమాన హీరో గాయాలపాలయ్యారు అనే విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని మళ్లీ షూటింగులో పాల్గొంటున్నారని విషయం తెలియడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. రవితేజ తాజాగా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో కనిపించారు. ఆ సమయంలో మాత్రం ఆయనకు ఎలాంటి గాయాలు అయినట్లు కూడా కనిపించలేదు

Read Also : #BoycottVirataParvam: సాయి పల్లవి వ్యాఖ్యలతో చిక్కుల్లో విరాటపర్వం.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం..

Read Also : Tollywood Releases : ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News