Raviteja: ఇట్స్ అఫీషియల్... నాలుగోసారి ఆ స్టార్ డైరెక్టర్‎తో మాస్ మహారాజా..!

Raviteja Upcoming Movie: క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. మాస్ మహారాజా రవితేజ- దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2023, 04:26 PM IST
Raviteja: ఇట్స్ అఫీషియల్... నాలుగోసారి ఆ స్టార్ డైరెక్టర్‎తో మాస్ మహారాజా..!

Raviteja and Gopichand Malineni: మాస్ మహారాజా రవితేజ- దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. ఇరువురు కలిసి ఇప్పటికే మూడు చిత్రాలు చేయగా.. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. వీరి కలయికలో గతంలో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు వచ్చాయి. మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వీరిద్దరూ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ విషయాన్ని ఆదివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 

కిందట సంవత్సరం 'ధమాకా' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఈ ఏడాది చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్యతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'రావణాసుర' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం మాస్ మహారాజా 'టైగర్ నాగేశ్వరరావు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్టువర్టుపురంలోని ఓ గజదొంగ బయోపిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 1970ల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించున్నారు. 

నటి రేణూ దేశాయ్ దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. హేమలతా లవణం అనే పాత్రలో మాస్ మహారాజాకు అక్కగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని అక్టోబరు 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు రవితేజ 'ఈగల్' అనే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు పూర్తవుగానే గోపిచంద్ మలినేని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: RC16 Movie: రామ్ చరణ్ సినిమాలో 'విజయ్ సేతుపతి'.. ఆ క్యారెక్టర్ కోసమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News