RC16 Movie: రామ్ చరణ్ సినిమాలో 'విజయ్ సేతుపతి'.. ఆ క్యారెక్టర్ కోసమేనా?

RC16 Movie: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2023, 09:47 AM IST
RC16 Movie: రామ్ చరణ్ సినిమాలో 'విజయ్ సేతుపతి'.. ఆ క్యారెక్టర్ కోసమేనా?

Ram Charan Upcoming Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇటీవల చరణ్ తండ్రి కావడంతో.. ఈ సినిమా షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మెుదలుకానుంది. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ మూవీ తర్వాత డైరక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోకు సంబంధించి గతంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది.  ఇందులో చరణ్ పాత్ర చాలా పవర్ పుల్ గా ఉండనుంది. అయితే ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కోసం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు-విజయ్ కలయికలో వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో విజయ్ రోల్ విలన్ గా కాదు.. కథను మలుపుతిప్పే పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Rangabali OTT: నాగశౌర్య‘'రంగబలి'’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ ప్రజెంటేషన్‌లో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీస్ కిలారు నిర్మించనున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా తెరరెక్కించబోతున్నారు. ఈ సినిమాకు మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: Sreeleela Pics: బెడ్‌పై శ్రీలీలా కిల్లింగ్ లుక్స్.. ధమాకా బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూస్తే నిద్రపట్టదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News