Bharateeyudu 2: తాతకి క్రేజ్ పోయిందా? అయోమయ స్థితిలో బ్లాక్ బస్టర్ సీక్వెల్!

Bharateeyudu 2 Trailer: 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ ఆయన భారతీయుడు వంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా.. జులై 12న విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఆసక్తికరంగా తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి రావడం లేదు. దానికి కారణం డైరెక్టర్ శంకర్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 7, 2024, 08:29 PM IST
Bharateeyudu 2:  తాతకి క్రేజ్ పోయిందా? అయోమయ స్థితిలో బ్లాక్ బస్టర్ సీక్వెల్!

Bharateeyudu 2 Release Date: గత కొంతకాలంగా స్టార్ డైరెక్టర్ శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాతో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని కూడా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నించారు శంకర్.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల అభిమానులు నిరాశ చెందువుతున్నారని చెప్పుకోవాలి. అయితే ముందుగా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాని పూర్తి చేసేసి ఇప్పుడు విడుదలకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా జూలై 12న విడుదల అవుతుంది అని అధికారికంగా ప్రకటించేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు.. అప్పటి నుంచి గేమ్ చేంజర్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని సోషల్ మీడియా ద్వారా.. కామెంట్లు పెడుతున్నారు. కానీ గేమ్ చేంజర్ సినిమా మీద ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. 

మరోవైపు భారతీయుడు 2 సినిమా విడుదల కి సిద్ధం అవుతుండడంతో సినిమా ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో మొదలుపెట్టింది చిత్ర బృందం. తమిళనాడులో కమల్ హాసన్ సినిమా కాబట్టి.. భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ తెలుగులో కమల్ హాసన్ కి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. 

ఎక్కడ టాలీవుడ్ లో ప్రమోషన్స్.. మొదలుపెడితే గేమ్ చేంజర్ సినిమా గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తారో అని శంకర్ కావాలనే తెలుగులో సినిమా ప్రమోషన్స్ మీద అంతా దృష్టి పెట్టడం లేదు.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అయినప్పటికీ..భారతీయుడు 2 మీద తెలుగు ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో బజ్ మాత్రం రావడం లేదు. 

ఈ కారణాల వల్లే శంకర్ భారతీయుడు 2 సినిమాని తెలుగులో పెద్దగా ప్రమోట్ చేయడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ విడుదల సమయం దగ్గరికి వస్తోంది కాబట్టి అటు తమిళ్లో మాత్రమే కాక ఇటు తెలుగులో కూడా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి శంకర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News