Prabhas: సీతారామం దర్శకుడితో ప్రభాస్.. కన్ఫామ్ అయిన రెబల్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్..

Prabhas -Hanu movie: ప్రస్తుతం ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఎన్నో రోజుల తరువాత సలార్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. దాదాపు మూడు చిత్రాల షూటింగ్ తో.. తన కాల్ షీట్ మొత్తం ఫిల్ చేసేసారు.. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా ఒప్పుకున్నారు మన రెబల్ స్టార్…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 12:06 PM IST
Prabhas: సీతారామం దర్శకుడితో ప్రభాస్.. కన్ఫామ్ అయిన రెబల్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్..

Hanu Raghavapudi: బాహుబలి తరువాత ప్రభాస్ కి అనుకున్న స్థాయిలో సూపర్ హిట్ రాలేదు. ఆ బాధలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది సలార్ సినిమా. ప్రభాస్ ని ఏ స్థాయి మాస్ లో చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలో చూపించి సూపర్ హిట్ అందుకుంది. కేజిఎఫ్ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన సినిమా అవ్వడంతో ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 AD సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న ఈ సినిమా నా వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా ఈ సినిమాలో కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే లాంటివారు నటిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు మారుతీ దర్శకత్వంలో రాబోతున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ఈ చిత్రం కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది. ఇక వీటన్నిటితో పాటు సలార్ రెండో భాగం కూడా త్వరలోనే మొదలుపెట్టనున్నారు. అనంతరం అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే పోలీస్ యాక్షన్ డ్రామా కూడా చేయబోతున్నారు. సందీప్ త్వరలో ఈ సినిమా వర్క్ మొదలుపెడతానని ఇటీవలే చెప్పాడు. ఇవన్నీ కాక బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. 

ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మన రెబల్ స్టార్ కొద్ది రోజుల వరకు ఇంక ఏ సినిమా ఒప్పుకోడేమో అనుకున్నారు అందరూ. కానీ అందరి ఆలోచనలను తారుమారు చేస్తూ మరో చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

తెలుగు ప్రేక్షకులకు ఎంతో కాలం గుర్తుంది పోయేలాగా సీతారామం లాంటి క్లాసిక్ సూపర్ హిట్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. హను రాఘవపూడి సీతారామం సినిమాకు పనిచేసిన విశాల్ చంద్రశేఖర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాకు కూడా చేయబోతున్నాను అని తెలిపాడు. ఇక దీంతో ప్రభాస్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారికంగానే తెలిసిపోయింది. మొత్తానికి రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు ప్రభాస్ ఫుల్ బిజీగా తన కెరీర్ ని నింపేశారు ‌

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News