Reviewer Uttara Prashanth : కరీంనగర్ కుర్రాడి జోరు.. రివ్యూల నుంచి సినిమాలు.. ప్రశాంత్ చిత్రాల లిస్ట్ ఇదే

Reviewer Uttara Prashanth రివ్యూలు చెప్పి సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా ఎందుకు ఫేమస్ అవుతారన్నది చెప్పలేం. ఇలా తెలుగులో యూట్యూబ్‌లో రివ్యూలు చెప్పి బాగానే ఫేమస్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 01:33 PM IST
  • నెట్టింట్లో ఉత్తర ప్రశాంత్ జోరు
  • రివ్యూలు చెప్పి ఫేమస్ అయిన ప్రశాంత్
  • మెన్ టూ, తురుంఖాన్‌లతో హల్చల్
Reviewer Uttara Prashanth : కరీంనగర్ కుర్రాడి జోరు.. రివ్యూల నుంచి సినిమాలు.. ప్రశాంత్ చిత్రాల లిస్ట్ ఇదే

Uttara Prashanth Movies List సోషల్ మీడియా ద్వారా చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో తమ తమ ప్రతిభను చాటుతూ వెండితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇస్తున్నారు. డబ్ స్మాష్‌, టిక్ టాక్‌ల ద్వారా ఎంతో మంది క్రేజ్ దక్కించుకుని సినిమాల్లోకి వచ్చారు. సక్సెస్ అయ్యారు. థియేటర్లో ముందు రివ్యూలు చెప్పే వారు కూడా సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ లిస్ట్‌లో ప్రశాంత్ కూడా ఉంటాడు. ఉత్తర సినిమాతో ప్రశాంత్ తెరంగేట్రం చేశాడు. ఈ కరీంనగర్ కుర్రాడు ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఉత్తర, రివ్యూ స్టార్‌లు అంటూ ఇలానే బాగానే సందడి చేశాడు. యూట్యూబ్‌లో తనదైన స్టైల్లో రివ్యూలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అతని చేతిలో మంచి ప్రాజెక్టులే ఉన్నాయి

జబర్దస్త్ షోకు దూరంగా ఉండి.. ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యాడు గెటప్ శ్రీను. సైడ్ పాత్రల నుంచి హీరోగా గెటప్ శ్రీను మారిపోయాడు. రాజుయాదవ్ అంటూ హీరోగా రాబోతోన్నాడు. ఈ సినిమాలోనూ ప్రశాంత్ నటిస్తున్నాడు. మెన్ టూ అనే సినిమాలోనూ ప్రశాంత్ కనిపిస్తాడు. ఈ చిత్రం ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

ఇలా ప్రశాంత్ వరుసగా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. తురుమ్‌ ఖాన్‌లు అనే మరో ఫన్నీ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇలా సోషల్ మీడియా నుంచి సినిమాల వరకు ఎదిగాడు ప్రశాంత్. ఇన్ స్టాగ్రాంలోనూ ప్రశాంత్ దూసుకుపోతోన్నాడు. లక్షకు పైగా ఫాలోవర్లతో ప్రశాంత్ సందడి చేస్తున్నాడు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News