Prime Minister Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఏకగ్రీవంగా ఎంపిక

Rishi Sunak to become the next Prime Minister of United Kingdom: భారత సంతతికి చెందిన రిషి సునక్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవనున్నారు, ఆయనకు పోటీగా బరిలో నిలిచిన వారంతా వెనక్కు తగ్గడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 24, 2022, 07:01 PM IST
Prime Minister Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఏకగ్రీవంగా ఎంపిక

Rishi Sunak to become the next Prime Minister of United Kingdom: బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక ఆ పదవి కోసం మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అలాగే పెన్నీ మోర్డాంట్ కన్జర్వేటివ్ పార్టీ నాయకులుగా పోటీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పదవికి భారత సంతతికి చెందిన  రిషి సునక్ ను వరించింది. కొన్నిరోజుల్లో ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇక అంతకు ముందే బ్రిటన్  మాజీ మంత్రులు ప్రీతి పటేల్, జేమ్స్ క్లీవర్లీ సహా నడిమ్ జాహవి కూడా రిషి సునక్‌కు తమ మద్దతు ప్రకటించారు. రిషి సునక్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, తన పార్టీని ఏకం చేసి దేశం కోసం పని చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక రిషి సునక్‌కు దాదాపు 144 మంది ఎంపీల మద్దతు ఉంది. ఎన్నికల్లో గెలిచిన సునక్ బ్రిటన్‌లో భారతీయ సంతతికి చెందిన తొలి ప్రధానిగా నిలిచారు. బ్రిటన్లో ప్రధానమంత్రి కావాలంటే కనీసం 100 మంది ఉండాలి.

నిజానికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతుదారులు ఆయనకు 100 మంది ఎంపీల మద్దతు ఉందని పేర్కొన్నా జాన్సన్ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ, సునక్‌కు తన కంటే ఎక్కువ మద్దతు ఉందని జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఆయన తప్పుకున్న తర్వాత ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న ఏకైక పోటీదారు బ్రిటీష్ పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్ నిలిచారు.

బ్రిటిష్ మీడియా వివరాల ప్రకారం, మోర్డాంట్‌కు కేవలం 25 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉండడంతో ఆమె కూడా రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో రిషి సునక్ గత నెలలో జరిగిన పార్టీ నాయకత్వ ఎన్నికల్లో పదవికి రాజీనామా చేసిన ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయారు. నిజానికి ముందుగా బోరిస్ జాన్సన్ కొన్ని నెలల క్రితం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత లిజ్ ట్రస్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు సునక్ కూడా ఆమెకు గట్టిపోటీ ఇచ్చారు. 

Also Read: Mahesh Love: మహేష్ బాబు ప్రేమ గురించి ఎవరికీ తెలియని నిజాలు బయటపెట్టిన మంజుల

Also Read: Kantara New Record: కాంతార కొత్త రికార్డు.. కర్ణాటకలో అత్యధికంగా వీక్షించిన సినిమా ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News