larissa bonesi : సాయి ధరమ్ తేజ్‌ లవ్‌ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే.. ప్రేమ కథలు బాగానే ఉన్నాయే

Sai Dharam Tej Love Story సాయి ధరమ్ తేజ్‌కు తాను పని చేసే హీరోయిన్లతో రిలేషన్ షిప్ బాగుంటుందని అందరికీ తెలిసిందే. అతను పని చేసే హీరోయిన్లతో ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పుడూ రూమర్లు బయటకు వస్తుంటాయి. అయితే నిజంగానే ఓ హీరోయిన్‌ను మాత్రం ప్రేమించాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 04:44 PM IST
  • విరూపాక్షతో హిట్టు కొట్టేసిన మెగా హీరో
  • సాయి ధరమ్ తేజ్ లవ్ స్టోరీలు వైరల్
  • తెరపైకి మరోసారి తిక్క హీరోయిన్
larissa bonesi : సాయి ధరమ్ తేజ్‌ లవ్‌ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే.. ప్రేమ కథలు బాగానే ఉన్నాయే

Sai Dharam Tej Love Story హీరో హీరోయిన్లు తెరపై ప్రేమించుకుంటారు. అది రీల్ కోసం నటిస్తుంటారు. అయితే కొంత మంది హీరో హీరోయిన్లు నిజంగానే ప్రేమలో పడతారు. అది పెళ్లి వరకు వెళ్తుందా? లేదా? అన్నది చెప్పలేం. అయితే కొందరు హీరోలు మాత్రం సెట్స్‌లో సందడి చేస్తుంటారు. వారితో పని చేసే హీరోయిన్లతో క్లోజ్‌గా ఉంటారు. ఈ లిస్ట్‌లోకి సాయి ధరమ్ తేజ్ కూడా వస్తుంటారు. కెరీర్ ప్రారంభంలోనే చాలా రూమర్లు వినిపించాయి.

రకుల్ ప్రీత్, రెజినా వంటి వారితో ప్రేమలో ఉన్నాడంటూ రూమర్లు వచ్చాయి. అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రం గతంలోనే తన ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. తాను ప్రేమించిన హీరోయిన్ గురించి చెప్పేశాడు. ఇప్పుడు మళ్లీ ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రేమించిన హీరోయిన్ ఎవరు? అనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Larissa Bonesi (@larissabonesi)

తిక్క సినిమాలో నటించిన లారిసా బొనేసిని తాను నిజంగానే ప్రేమించినట్టుగా.. కానీ తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, సారీ చెప్పినట్టుగా సాయి ధరమ్ తేజ్ అప్పట్లోనే ఓపెన్‌గా చెప్పాడు. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదని బాంబేకి వెళ్లిపోయిందని కూడా బాధపడ్డాడు. అయితే ఇప్పుడు ఈ విషయాలు బాగానే వైరల్ అవుతున్నాయి.

 

ఇది కాకుండా చదువుకునే రోజుల్లో కూడా లవ్ స్టోరీ ఉండేదట. చదువంతా పూర్తయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడట. ఆ విషయం తన అమ్మకి, పవన్ కళ్యాణ్‌కి తెలుసంట. కానీ చివరకు అది కూడా జరగలేదట. అయితే తనకు హీరోయిన్లలో మాత్రం సమంత అంటే ఇష్టమని, ఆమె కష్టపడే తత్త్వం ఇంకా ఇష్టమని సాయి ధరమ్ తేజ్ చెబుతుంటాడు.

Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక

సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కమ్ బ్యాక్‌తో హిట్ కొట్టేశాడు. బైక్ ప్రమాదం తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను చేశాడు. ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక వీకెండ్‌లో కలెక్షన్లు అదిరిపోనున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతోన్నట్టు అనిపిస్తోంది.

Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x