Republic release date: సాయి ధరమ్ తేజ్ ఎప్పుడొచ్చేది ఖరారైపోయింది

Republic release date: కరోనా సంక్షోభ కాలంలో అగిన సినిమాల ప్రభావం..ఈ ఏడాది వరుస సినిమాల విడుదలతో టాలీవుడ్ షెడ్యూల్ బిజీగా మారిపోయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా విడుదల తేదీ ఖరారైపోయింది. 

Last Updated : Feb 1, 2021, 08:56 PM IST
Republic release date: సాయి ధరమ్ తేజ్ ఎప్పుడొచ్చేది ఖరారైపోయింది

Republic release date: కరోనా సంక్షోభ కాలంలో అగిన సినిమాల ప్రభావం..ఈ ఏడాది వరుస సినిమాల విడుదలతో టాలీవుడ్ షెడ్యూల్ బిజీగా మారిపోయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా విడుదల తేదీ ఖరారైపోయింది.  

టాలీవుడ్ ఇండస్ట్రీ ( Tollywood Industry ) కు 2021 బాగా కలిసొచ్చేట్టు ఉంది. వరుస సినిమాలతో మొత్తం ఏడాది క్యాలెండర్ బిజీ అయిపోయింది. ఇప్పటికే 20 సినిమాల విడుదల తేదీలు ఈ ఏడాదిలో ఖరారైపోయాయి. అంతేకాదు దర్శక నిర్మాతలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సినిమా నిర్మాణం పూర్తి కాకుండానే..లెక్కలేసుకుని రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) నటిస్తున్న రిపబ్లిక్ సినిమా ( Republic Movie ) విడుదల తేదీని ఫిక్స్ చేసేశారు. విలక్షణ చిత్రాల దర్శకుడైన దేవ్ కట్టా ( Dev katta ) రిపబ్లిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సంజయ్ దత్ హీరోగా ప్రస్థానం సినిమాను హిందీలో రీమేక్ చేసిన దేవ్ కట్టా..మంచు విష్ణుతో డైనమైట్ తీశాడు.రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడం విశేషం. 

ఈ తరుణంలో మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు కథ చెప్పి ఒప్పించగలిగాడు దేవ్ కట్టా. అంతేకాదు తన కెరీర్‌లోనే తొలిసారి పొలిటికల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాతో. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. రమ్యకృష్ణ ( Ramyakrishna ) ప్రతినాయిక పాత్రలో నటిస్తోంది. సినిమాలో రమ్యకృష్ణది పవర్‌ఫుల్  రోల్ అని తెలుస్తోంది. వరుసగా 6 ఫ్లాప్స్ మూటగట్టుకున్నాక..3 విజయాలు అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. 2019లో విడుదలైన చిత్రలహరి, ప్రతిరోజూ పండగలతో విజయాలందుకుని..2020 చివర్లో సోలో బ్రతుకే సో బెటర్‌తో ఫరవాలేదన్పించాడు. కరోనా సంక్షోభం అనంతరం థియేటర్లలో విడుదలైన తొలి సినిమా ఇది. 13 కోట్లు వసూలు చేసింది. సాయి థరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ జూన్ 4న విడుదల ( Republic releasing on june 4 ) కానుంది. మే 28న బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా బీబీ3 ( BB3 ), రవితేజ ( Raviteja )నటించిన ఖిలాడి విడుదల కానున్నాయి. 

Also read: Sulthan Telugu Teaser : ఆసక్తిరేపుతున్న సుల్తాన్ టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News