Sai Pallavi Movies : సైలెంట్ అయిన సాయి పల్లవి.. సినిమాలకు ఇక పూర్తిగా దూరమా?

Sai Pallavi Become Silent సాయి పల్లవి ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాట పర్వాం, గార్గి అనే సినిమాలతో సాయి పల్లవి తన ఫ్యాన్స్‌ను పలకరించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 11:36 AM IST
  • రెండు సినిమాలతో సాయి పల్లవి సందడి
  • కాంట్రవర్సీలో చిక్కుకున్న క్రేజీ బ్యూటీ
  • సినిమాలకు సాయి పల్లవి దూరమేనా?
Sai Pallavi Movies : సైలెంట్ అయిన సాయి పల్లవి.. సినిమాలకు ఇక పూర్తిగా దూరమా?

Sai Pallavi No New Offers సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ అంతటి వాడే సాయి పల్లవిని లేడీ సూపర్ స్టార్ అని పొగిడేశాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమా హిట్ అవ్వడంలో సాయి పల్లవి పాత్రే ముఖ్యమని అందరికీ తెలిసిందే. సాయి పల్లవి నటన, ఆమె అప్పియరెన్స్ సినిమాను హిట్ చేశాయి. అయితే సాయి పల్లవి క్రేజ్ హీరోలందరిలోకెల్లా ప్రత్యేకం. ఆమె స్క్రీన్ మీదుంటే..పక్కన ఏ హీరో ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అంతటి క్రేజ్‌ను సాయి పల్లవి దక్కించుకుంది.

ఎన్నో అంచనాల నడుము వచ్చిన విరాటపర్వం సినిమా దారుణంగా బెడిసికొట్టేసింది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించినా కూడా సినిమాను హిట్ చేయలేకపోయింది. కోటి షేర్ కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. అలా సాయి పల్లవి స్టామినా మీద అందరికీ అనుమానం వచ్చింది. అయితే ఈ సినిమా ఇలా బెడిసి కొట్టేసినా.. గార్గి సినిమాతో సాయి పల్లవి హిట్ కొట్టేసింది. తమిళ డబ్బింగ్ సినిమాగా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది.

గార్గి సినిమాలో సాయి పల్లవి నటనను చూసి అంతా ఫిదా అయ్యారు. సాయి పల్లవి గార్గి సినిమా సైతం బాగానే ఆడింది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. సాయి పల్లవి విరాటపర్వం సమయంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నక్సలిజం, హింస గురించి మాట్లాడుతూ.. ముస్లింల మీద హిందువులు చేసే దాడిని కూడా నక్సలిజంతో పోల్చింది. హింస ఏ రూపంలో ఉన్నా, ఎవరు చేసినా తప్పి అని చెప్పే ఉద్దేశ్యంలో ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా మీద విమర్శలు చేసింది.

దీంతో సాయి పల్లవి మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అయితే తాను చెప్పదల్చుకున్నది సరిగ్గా చెప్పలేకపోయాను అని, హింస ఎవరు చేసినా తప్పే అనే ఉద్దేశ్యంలో తాను అలా మాట్లాడాను అంటూ సాయి పల్లవి తరువాత వివరణ ఇచ్చుకుంది. అయితే ఈ వివాదం వల్ల సాయి పల్లవికి కాస్త బ్యాడ్ జరిగింది. ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేనట్టుగా ఉంది.

సినిమాలు నచ్చితేనే చేస్తాను అని లేదంటే క్లినిక్ పెట్టుకుని బతికేస్తాను అంటూ తన వైద్య వృత్తి గురించి సాయి పల్లవి చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు సాయి పల్లవి నిజంగానే సినిమాలకు దూరమైందా? హాస్పిటల్ పెట్టుకుందా? అన్నది తెలియడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాయి పల్లవి మొత్తంగా సైలెంట్ అయిపోయింది

Also Read : Jr NTR Wife : అలాంటి ఫోటోను షేర్ చేశాడేంటి?.. భార్యను కౌగిట్లో బంధించిన ఎన్టీఆర్

Also Read : Kalyaan Dhev : ఓపిగ్గా ఉంటే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది!.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News