Salman Khan Wig : సల్మాన్ ఖాన్ విగ్.. నెటిజన్ల ట్రోలింగ్.. ఆ లుక్కేంటి అంటూ కౌంటర్లు

Salman Khan Wig సల్మాన్ ఖాన్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. తన కొత్త చిత్రానికి సంబంధించిన షూట్ అప్డేట్‌ను కూడా షేర్ చేశాడు. సల్మాన్ ఖాన్ లుక్‌ మీద జనాలు రకరకాలుగా కౌంటర్లు వేస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 05:31 PM IST
  • సల్మాన్ ఖాన్ కొత్త సినిమా అప్డేట్
  • కిసి కా భాయ్ కిసి కా జాన్ షూట్ పూర్తి
  • సల్మాన్ ఖాన్ విగ్గు మీద చర్చలు
Salman Khan Wig : సల్మాన్ ఖాన్ విగ్.. నెటిజన్ల ట్రోలింగ్.. ఆ లుక్కేంటి అంటూ కౌంటర్లు

Kisi ka Bhai Kisi ki Jaan Salman Khan Look : సల్మాన్ ఖాన్ సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్‌లో దుమ్ములేపేవి. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా కూడా మినిమం వంద కోట్లు కొల్లగొట్టేవి. కానీ కరోనా సమయంలో విడుదల చేసిన రాధే సినిమా.. అంతకు ముందు వచ్చిన ట్యూబ్ లైట్ అన్నీ కూడా బోల్తాపడ్డాయి. మరీ ముఖ్యంగా ప్రభుదేవా సల్మాన్ కాంబోలో వచ్చిన రాధే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అసలే బాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్,సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది.

ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ పరమ రొటీన్ చిత్రాలను చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కిసి కా భాయ్ కిసి కా జాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి ముందు కభీ ఈద్ కభీ దివాలి అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ ఆ తరువాత కిసి కా భాయ్ కిసి కా జాన్ అంటూ మార్చేశారు.ఈ సినిమా కోసం మన జానీ మాస్టర్‌ కూడా పని చేశాడు. సాంగ్ షూట్ పూర్తయిందని నిన్న జానీ మాస్టర్ పోస్ట్ వేశాడు.

 

సల్మాన్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. షూటింగ్ పూర్తయిందని, వచ్చే ఏడాది రంజాన్‌కు ఈ సినిమాను విడుదల చేయబోతోన్నట్టుగా ట్వీట్ వేశాడు. సల్మాన్ ఖాన్ వేసిన ఈ పోస్ట్‌లో ఆయన గెటప్, ఆయన విగ్గు చూసి జనాలు నవ్వేసుకుంటున్నారు. ఇదేమీ ఒకప్పటి కాలం కాదు.. జనాలు ఏది విగ్గు ఏది ఒరిజినల్‌  అన్నది ఇట్టే తెలుసుకుంటున్నారు.

పాత్ర కోసం నిజంగానే జుట్టు పెంచుకుంటున్నారా? లేదా విగ్గులు పెట్టుకుంటున్నారా? అనేది తెలిసిపోతోంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్  ఈ సినిమా కోసం పెట్టుకున్న విగ్గు మీద ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఆ పెట్టుడు పొడుగు జుట్టుతో సల్మాన్ మరింత చెత్తగా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Also Read : Bigg Boss Revanth : గుండెలు పిండేసిన బిగ్ బాస్.. సింగర్ రేవంత్‌ను పాపను చూపించి ఏడిపించేడుగా

Also Read : Ariana Viviana Birthday : మంచు విష్ణు కూతుళ్ల బర్త్ డే.. అరియానా, వివియానా పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News