Samantha: కోలీవుడ్ లో సినిమా సైన్ చేసిన సమంత.. నాలుగవసారి మళ్లీ అదే హీరోతో!

Samantha Vijay Movies: టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. సమంత గత కొంతకాలంగా.. సినిమాల విషయంలో జోరు తగ్గించేసింది. సినిమాల విషయంలో.. ఆచితూచి అడుగులు వేస్తున్న సామ్ ఇప్పుడు తమిళ్లో.. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న.. ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 2, 2024, 07:50 PM IST
Samantha: కోలీవుడ్ లో సినిమా సైన్ చేసిన సమంత.. నాలుగవసారి మళ్లీ అదే హీరోతో!

Samantha in Thalapathy 69: స్టార్ బ్యూటీ సమంత తాజాగా తమిళ్లో స్టార్ హీరో అయిన.. విజయ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ్, సమంత కాంబినేషన్ లో ఇప్పటికే కత్తి, తేరి, మెర్సల్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో వీళ్ళిద్దరికి కాంబోలో.. వస్తున్న ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్..అవుతుంది అని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెర్కొండ పార్వయ్..ఫేమ్ హెచ్ వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

అసలు విషయానికి వస్తే పూర్తిగా.. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు విజయ్ ఒక మంచి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ప్రొడక్షన్స్ వారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విజయ్ ఆఖరి సినిమా కోసం 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్.. తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT) ..సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి హెచ్ వినోద్ తలపతి69 సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయబోతున్నారు. 

అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని.. అందిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది.. వేసవికల్లా సినిమాని విడుదల చేయాలని.. చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా సమంత కెరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో.. వేచి చూడాలి.

ఇది కాకుండా సమంత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లతో.. బిజీగా ఉంది. వరుణ్ ధవన్ తో సిటాడెల్.. అనే వెబ్ సిరీస్ లో నటించిన సమంత తాజాగా ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న రక్త బీజ్ వెబ్ సిరీస్ లో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో కూడా సమంత ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు సమాచారం. 

ఇక తెలుగు విషయానికి వస్తే సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణ బ్యానర్లో.. ఇప్పుడు సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x