Animal: సోషల్ మీడియాని ఊపేస్తూన్న విలన్ సాంగ్..

Animal Song: యానిమల్ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రంలో ఉన్న బోల్డ్ సన్నివేశాల గురించి ప్రస్తావన ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు వచ్చే పాట మరి ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2023, 11:56 AM IST
Animal: సోషల్ మీడియాని ఊపేస్తూన్న విలన్ సాంగ్..

Bobby Deol: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా విడుదలైన రోజు నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్గా చేసిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రంపై అంచనాలు హిందీ వారికి అలానే తెలుగు వారికి ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యాక కూడా వారి అంచనాలను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరో హీరోయిన్ తో పాటు మంచి పేరు తెచ్చుకున్న యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్.. వీరిద్దరూ ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇందులో బాబీ డియోల్ పాత్ర చాలా చిన్నదే అయినా.. సినిమా మొత్తం పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో కనిపించే ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ విలన్ ఎంట్రీలో వచ్చే సాంగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

బాబీ డియోల్ పాత్ర తాను మూడో పెళ్లి కి ఇష్టమై పార్టీ చేసుకుంటూ ఉండగా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక ఈ పాత్రని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు యన చుట్టూ ఉన్న కొంతమంది సింగర్స్ ఒక పాట పాడుతూ కనిపిస్తారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ బిట్ సాంగ్ లెంగ్త్ తక్కువే కానీ దాని ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది ప్రేక్షకులపై.
కొత్త సినిమాల నుంచి ఏ చిన్న కంటెంట్ దొరికినా వదలని మన తెలుగు మీమర్స్ అయితే ఈ పాటను మామూలుగా వాడట్లేదు. ఈ పాటని షింక్  చేసి మీమ్స్ వేస్తున్నారు. 

అయితే ఈ పాట యానిమల్ వర్జినల్ కంపోజిషన్ కాదు. జమాల్ జమాలూ అనే అరబిక్ పాట నుంచి ఈ మ్యూజిక్ బిట్ తీసుకున్నారు. కాగా బాబీ డియల్ సీన్ కి ఆయన డాన్స్ కి ఈ పాట కరెక్టుగా సెట్ అయింది. మంచి ఊపున్న ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మొత్తానికి మరోసారి యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి తన మార్క్ చూపించి ఈసారి ఏకంగా స్టార్ డైరెక్టర్ లిస్టులో పెర్మనెంట్ స్థానాన్ని పొందారు.

Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..

Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News