నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, సాయి కుమార్, ఎస్.జే.సూర్య, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, అజయ్ తదితరులు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: మురళి జి
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నాని తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథా చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ రూట్లోనే తనకు గతంలో ‘అంటే సుందరానికీ’ వంటి డిఫరెంట్ మూవీ చేసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సూర్య (నాని) చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. హైదరాబాద్ లోని ‘సోకులపాలెం’ లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉంటాడు. అంతేకాదు ఎదుటి వారు ఎవరైనా తప్పు చేస్తే.. వారిపై తన కోపం అనే కంటే ధర్మాగ్రమం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బుందులకు ఫేస్ చేస్తుంటారు. ఈ సందర్భంగా సూర్య తల్లి అతని కోపాన్ని అణుచుకోమని చెబుతుంది. అంతేకాదు కోపాన్ని ప్రదర్శించడానికి వారంలో ఓ రోజు పెట్టుకోమని చెబుతుంది. ఆ వారం రోజుల్లో అతనికి ఎవరిపై కోపం ఉంటే వారిపై ఆ కోపాన్ని ప్రదర్శించమని చెబుతుంది. తల్లికి ఇచ్చిన మాట కోసం ప్రతి శనివారం తన కోపాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తుంటాడు సూర్య. ఈ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసాడు. మరోవైపు ‘సోకుల పాలెం’ అనే ఊరు వాళ్లు ఓ సీఐ కారణంగా ఎన్నో దారుణాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సోకుల పాలెం వారినీ సీఐ నుంచి సూర్య ఎలా రక్షించాడు అనేదే మిగిలిన స్టోరీ. మధ్యలో మరదలితో లవ్ స్టోరీ.. కట్ చేస్తే ఇది ‘సరిపోదా శనివారం’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు వివేక్ ఆత్రేయ.. తాను చెప్పాలనుకున్న దాన్ని సూటిగా కాకుండా సుత్తితో ప్రేక్షకుల నెత్తిపై మెట్టికాయలు వేసినట్టు చెప్పాడు. 2 గంటల్లో ముగించాల్సిన సినిమాను 3 గంటల కు ప్రేక్షకులను కూర్చొబెట్టి వాళ్ల సహనాన్ని పరీక్షించాడనే చెప్పాలి. పైగా చిన్నప్పటి హీరో ఎపిసోడ్ ను అరగంటకు పైగ సాగదీయడం పెద్ద మైనస్. హీరోకు కోపం ఎక్కువ. దాన్ని ప్రదర్శించడానికి వారంలో శనివారం పెట్టుకుంటాడు. ఈ సంద్భంగా తల్లి మాట ఇస్తాడు. ఇదంతా ఓకే కానీ... ఈ సినిమా మొత్తం హైదరాబాద్ లో జరిగినట్టు చూపించాడు. హైదరాబాద్ లో సోకుల పాలెం అనే బస్తీని చూపెట్టాడు. మరోవైపు విలన్ సీఐ దయానంద్ అలియాస్ దయా (ఎస్.జే.సూర్య) పెద్ద హోదాలో ఉన్నా.. ఏదో సముద్రం ఒడ్డున ఏదో గుడిసెలో ఉన్నట్టు చూపించడం అంతగా కనెక్ట్ కాదు. హైదరాబాద్ లో కథ జరుగుతున్నట్టు చూపించినా.. అదంత ఏదో సముద్ర తీరం గల ప్రాంతంలో జరిగిన కథలా సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో వివేక్ కాస్త దృష్టి పెడితే బాగుండేది. పైగా సీఐ వాళ్ల అన్న ఓ రాజకీయ నాయకుడు (మురళీ శర్మ) అతను సోకుల పాలెం వాళ్ల ఓట్లతో కార్పోరేటర్ గా గెలుస్తాడు. అతనితో ఓ లాండ్ డిస్ఫూట్ ఉంటుంది. దీంతో వాళ్లంటే దయాకు ఎక్కడో తెలియని కసి ఉంటుంది. చీటికి మాటికి తన మూడ్ బాగాలేనప్పుడు వాళ్లలో ఒకడిని తీసుకొచ్చి చిదక బాదుతూ ఉంటాడు.
ఈ క్రమంలో సోకుల పాలెంకు అండగా నిలిచేవారు ఎవరు ఉండరు. ఓ మీడియా సీఐ ఆగడాలను ఎందుకు ప్రశ్నించదు. ఎక్కడో ఏదో జరిగితే స్పందించే మానవ హక్కుల సంఘాలు వీళ్ల విషయంలో ఎక్కడా ఈ సినిమాలో నోరు ఎత్తదు. ఆ విషయంలో లాజిక్స్ అడగ కూడదు.
ఒక సీఐ ఒక ఏరియాలో ఎక్కువలో ఎక్కువగా అంటే ఐదారాళ్లకు మించి పనిచేయలేదు. కానీ ఈ సీఐ మాత్రం సోకుల పాలెం అనే బస్తీకి అనధికార రాజుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఓ సీన్ లో తన కారుతో ఎవరి కారును గుద్దితే.. అవతలి వాళ్లు సెన్స్ లేదా అన్నందకు ఆమె కారును నుజ్జు నుజ్జు చేస్తాడు. ఈ మధ్యకాలంలో చీమ చిటుక్కుమన్నా.. ఫోన్ కెమెరాలో బంధించి అవతలి వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా.. వాళ్ల గుట్టుమట్లను విప్పే సోషల్ మీడియా ఉన్న ఈ జమానాలో ఓ సీఐ దాష్టీకాలను అక్కడి ప్రజలు భరించడం హారబుల్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాని ఎలివేషన్ కన్నా.. విలన్ ఎస్.జే.సూర్య ఎలివేషన్ ఎక్కువగా కనిపించింది. తాను ఎంచుకున్నా.. పాయింట్ ఏ 90ల కాలంలో వర్కౌట్ అయ్యే ప్లాను ను ఇంకా 2024లో అప్లై చేయడం ఎందుకో దర్శకుడికే తెలియాలి. మొత్తంగా నాని, సూర్య మధ్య వచ్చే సీన్స్ ఇంటర్వెల్ కే సినిమా మొత్తం దాదాపు కొలిక్కి వచ్చేసినా... దాన్ని మరో గంటన్నర పొడిగించడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడమే అని చెప్పాలి. పైగా ఎపుడు చిన్నపుడు కనిపించకుండా పోయిన అత్తా, మరదలి కోసం హీరో వెతకడం వంటివి సిల్లీగా అనిపిస్తాయి. పైగా చివర్లో సమాజంలో మన కోసం మనమే అన్యాయాలపై పోరాడాలనే కాన్సెప్ట్ చెప్పాడు. కమర్షియల్ యాంగిల్ ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. జేక్స్ బిజోయ్ పాటల పరంగా నిరాశ పరిచినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసాడు. ఫోటోగ్రఫీ బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
నాని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమలో తన నటనతో ఆకట్టుకున్నా.. ఎస్.జే.సూర్యతో ఉన్న సీన్స్ లలో నాని డామినేట్ చేసినట్టు కనిపించింది. ఎస్.జే.సూర్య మరోసారి తన సైకో విలనిజాన్నిఅద్భుతంగా పండించాడు. ఆ పాత్రలో అతను తప్పించి మరొకరికీ ఊహించుకోవడం కష్టం అనే రీతిలో నటించాడు. మరోవైప ఎస్.జే.సూర్య అన్న పాత్రలో నటించిన మురళీ శర్మ మరోసారి తనదైన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసాడు. సాయి కుమార్ నటన గురించి కొత్తగ చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కు ఈ సినిమాలో పెద్దగా నటించే స్కోప్ రాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నాని, ఎస్.జే.సూర్యల పోటా పోటీ నటన
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
పాటలు
సినిమా నిడివి
స్క్రీన్ ప్లే
లాజిక్ లేని సీన్స్
పంచ్ లైన్.. ‘సరిపోదా శనివారం’.. ప్రేక్షకులకు సరిపోదు..
రేటింగ్..2.75/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..