Sarkaru Vari Pata Movie: సర్కార్ వారి పాట మూవీ ప్రీ రిలీజ్..అదరహో...!

Sarkaru Vari Pata Movie: హైదరాబాద్‌లో సూపర్ స్టార్ మహేష్‌ బాబు అభిమానుల సందడి నెలకొంది. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సర్కార్‌ వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 09:18 PM IST
  • అట్టహాసంగా సర్కార్‌వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు మూవీ
  • రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా
Sarkaru Vari Pata Movie: సర్కార్ వారి పాట మూవీ ప్రీ రిలీజ్..అదరహో...!

Sarkaru Vari Pata Movie: హైదరాబాద్‌లో సూపర్ స్టార్ మహేష్‌ బాబు అభిమానుల సందడి నెలకొంది. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సర్కార్‌ వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ హీరో మహేష్‌బాబు అభిమానులతో కిక్కిరిపోయింది. ఈనెల 12న సర్కార్ వారి పాట సినిమా వస్తోంది. ఈక్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈవెంట్‌లో హీరో మహేష్‌బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌, డైరెక్టర్లు సుకుమార్, వంశీతోపాటు ఇతర సినీ ప్రముఖులు హాజరైయ్యారు. మహేష్‌ బాబు మూవీ సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి.

రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈమూవీ రూపొందింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వస్తుండటంతో ఈమూవీపై భారీ అంచనాలున్నాయి. మహేష్‌(MAHESH)కు జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. ఫుల్ మాస్‌ మూవీ సర్కార్ వారి పాట తెరకెక్కింది. ఇప్పటి రిలీజ్‌ అయిన మహేష్ లుక్‌ అదిరిపోయింది. కళావతి సాంగ్ సైతం సూపర్ హిట్ అయ్యింది. పెన్నీ సాంగ్‌లో సితార స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్ అందించాడు. 

 

Also read:HDFC Interest Rate: హోమ్ లోన్స్ తీసుకునేవారికి నిరాశే, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు పెంపు

Also read:Suma Accident Video: యాంకర్ సుమకు ఏమైంది, కాలు జారి పడిపోయిన సుమ, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News