Asian Namratha Coffe Shop: అప్పుడే రెండో రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసేస్తున్న మహేష్ భార్య!

Namratha Minerva Coffe Shop: ఇప్పటికే ఏషియన్ నమ్రత పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు మరో రెస్టారెంట్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 7, 2022, 03:19 PM IST
Asian Namratha Coffe Shop: అప్పుడే రెండో రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసేస్తున్న మహేష్ భార్య!

Second Asian Namratha Minerva Coffe Shop to open on December 8th: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఒకపక్క సినిమా హీరోగా కొనసాగుతూనే మరో పక్క పలు వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన కేవలం సినిమా హీరోగా మాత్రమే ఉండేవారు తర్వాత ముందుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ అనే ఒక బ్యానర్ ఏర్పాటు చేసి తాను చేస్తున్న సినిమాల్లోనే తానే స్వయంగా పెట్టుబడులు పెట్టడం కూడా ప్రారంభించారు.

ఆ తర్వాత ఏషియన్ సునీల్‌తో కలిసి ఏషియన్ మహేష్ బాబు థియేటర్ కూడా ప్రారంభించి మంచి లాభాలు కూడా అందుకుంటున్నారు. ఏషియన్ సునీల్‌తో వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మీద మంచి నమ్మకం ఏర్పడడంతో పాటు ఆయనతో కలిసి నడిస్తే మరిన్ని లాభాలు ఉంటాయని భావించిన మహేష్ బాబు ఆయనతో కలిసి మరిన్ని వ్యాపారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఏషియన్ నమ్రతా పేరుతో రెస్టారెంట్లు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోని ఇటీవల బంజారాహిల్స్‌లో ఏషియన్ నమ్రత మినర్వా కాఫీ కేఫ్ పేరుతో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయగా ఇప్పుడు మరో రెస్టారెంట్ కూడా అదే పేరుతొ ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 8వ తేదీన ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతోంది. దానికి కూడా కేఫ్ మినర్వా అనే పేరు ఫిక్స్ చేశారు. నిజానికి మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అయితే తర్వాత ఆయన కోలుకోవడంతో ఇటీవల దుబాయ్ లో ఒక షూట్‌కి కూడా వెళ్లారు.

ఇక ప్రస్తుతానికి దుబాయ్‌లోనే మహేష్ బాబు ఉన్నారని ఆయన దుబాయ్‌లోనే త్రివిక్రమ్‌తో కలిసి తమన్ తో మ్యూజిక్ సిటింగ్స్ కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజాలు ఉన్నాయో తెలియదు కానీ... ఆ మేరకు ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక నమ్రత పేరుతో ప్రారంభిస్తున్న రెండవ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి నమ్రత హాజరవుతారా లేక మొదటి రెస్టారెంట్ ఓపెనింగ్ జరిగినట్లుగానే కేవలం ఏషియన్ సునీల్ చేతుల మీద గాని ఈ ప్రారంభోత్సవం జరుగుతుందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read: Niharika Konidela: ఆ విషయంలో మా అత్త కాళ్లు మొక్కాలంటున్న మెగా డాటర్!

Also Read: చిరు ఫ్యాన్ నేను.. అందుకే అలా ట్వీట్ చేశా.. ఎట్టకేలకు నోరు విప్పిన వర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News