టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత... ఆరోగ్య పరిస్థితి విషమం...?

Kaikala Satyanarayana hospitalised : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 12:21 PM IST
  • దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత
    హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స
    ప్రస్తుతం విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి
టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత... ఆరోగ్య పరిస్థితి విషమం...?

Kaikala Satyanarayana hospitalised: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కైకాల (Kaikala Satyanarayana) హైదరాబాద్‌లోని తన నివాసంలో కాలు జారిపడ్డారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా కైకాల మరోసారి అస్వస్థతకు గురవడం ఆయన అభిమానులను, టాలీవుడ్ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

తెలుగు సినీ రంగంలో (Tollywood) కైకాల సత్యనారాయణది సుదీర్ఘ ప్రస్థానం. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దాదాపు 777 సినిమాల్లో నటించి నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు అందుకున్నారు. పౌరాణిక, సాంఘీక, జానపద చిత్రాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలక్షణ నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయి విలక్షణ నటుడిగా పేరు పొందారు. చివరిసారిగా 2019లో విడుదలైన 'ఎన్టీఆర్ కథా నాయకుడు', 'మహర్షి' (Maharshi movie) చిత్రాల్లో కైకాల వెండితెరపై మెరిశారు. అప్పటినుంచి ఆయన మళ్లీ వెండి తెరపై కనిపించలేదు.

Also Read: సందీప్‌ రెడ్డి వంగా, రణ్‌బీర్‌ కపూర్‌‌ల..యానిమల్‌ మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామం. 1935 జూలై 25న ఆయన జన్మించారు. 1960లో సత్యనారాయణ నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సినిమాల్లో నటిస్తుండగానే 1996లో రాజకీయాల్లోనూ కైకాల అడుగుపెట్టారు. అప్పట్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా గెలిచారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News