Shah Rukh Khan: అమితాబ్ కాళ్లపై పడ్డ షారుఖ్.. జయపై ట్రోలింగ్.. అసలు ఏమైందంటే?

Shah Rukh Khan Touches Amitabh Bachchan Feet: బాలీవుడ్ లో ఒక టాప్ హీరో మరో టాప్ హీరో కాళ్ల మీద పడిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 16, 2022, 06:32 PM IST
Shah Rukh Khan: అమితాబ్ కాళ్లపై పడ్డ షారుఖ్.. జయపై ట్రోలింగ్.. అసలు ఏమైందంటే?

Shah Rukh Khan Touches Amitabh Bachchan And Jaya Feet: కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది, ఇప్పుడు దానికి సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటన్నిటిలో ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిన్న పాటి వీడియోలో షారుక్ ఖాన్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ పాదాలను తాకుతున్నాడు. ఆ తరువాత బిగ్ బి షారుక్ ను హత్తుకుని కౌగిలించుకోవడం కూడా కనిపిస్తుంది.

ఇక అదే సమయంలో, రాణి ముఖర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ క్రమంలోనే రాణి షారుక్ చేతిని ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఒకటి కూడా సోకల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే యాదృచ్ఛికంగా, ఈ నటీనటులందరూ కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో కలిసి నటించారు. కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కి సంబంధించిన ఆసక్తికరమైన ఈ వీడియో వైరల్‌గా మారింది. వైరల్ అయిన వీడియోలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ఒకే వేదికపై కూర్చొని ఉన్నారు.

ఆ సమయంలో షారుక్ అమితాబ్ బచ్చన్ వద్దకు వచ్చి ఆయన పాదాలను తాకాడు. వెంటనే అమితాబ్ బచ్చన్ లేచి అతనితో మాట్లాడి ప్రేమగా కౌగిలించుకున్నాడు.అందుకే షారుక్ కూడా జయా బచ్చన్ పాదాలను తాకాడు కానీ జయ అతడిని అలా చేయకుండా అడ్డుకుంది, ఆ సమయంలో రాణి ముఖర్జీ కూడా అక్కడికి వస్తున్నారు. రాణి అక్కడికి చేరుకోగానే, జయ బచ్చన్ ఆమెను కూర్చోబెట్టడానికి లేచి నిలబడింది.

కానీ షారుఖ్ వచ్చినపుడు లేవలేదు కానీ రాణి వచ్చినపుడు లేవడంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు షారుఖ్ అభిమానులు. ఇక రాణి ముఖర్జీ కూడా వేదికపైకి రాగానే జయ బచ్చన్ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో శత్రుఘ్న సిన్హా కూడా షారుఖ్‌ను ప్రశంసించారు. 'షారుక్‌ ఖాన్‌ అని చెప్పాల్సిన అవసరం లేదు, నేషనల్‌ స్టార్‌ అని చెప్పాలి, అది షారుక్‌ ఖాన్‌కె సూట్ అవుతుంది' అని ఆయన అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మహేష్ భట్, సౌరవ్ గంగూలీ, కుమార్ సాను అలాగే శత్రుఘ్న సిన్హా కూడా హాజరయ్యారు.

Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విజేత ఎవరంటే?.. ముందే చెప్పేసిన గూగుల్

Also Read : Varisu - Mahesh babu: మహేష్ బాబు వద్దన్న కధే వారిసు.. రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ లను టచ్ చేస్తూ విజయ్ వద్దకు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News