Sherlyn Chopra : రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా

Sherlyn Chopra Files Harassment Complaint : రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చింది. తాజాగా షెర్లిన్ చోప్రా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2021, 05:54 PM IST
  • శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు
  • శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్‌కుంద్రా మోసం చేశారంటూ షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
  • రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్‌ డాన్‌తో సంబంధం ఉందంటూ సంచలన కామెంట్‌
Sherlyn Chopra : రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా

Sherlyn Chopra Files Harassment Complaint Against Raj Kundra and Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజ్‌ కుంద్రాతో (Raj Kundra) పాటు శిల్పాశెట్టిపై (Shilpa Shetty) రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. డబ్బు తీసుకుని తమని మోసం చేశారంటూ పలువురు శిల్పా, ఆమె భర్తపై పలువురు ఆరోపించారు. అంతేకాదు పోలీసులను (police) కూడా ఆశ్రయిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా (Raj Kundra) అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చింది. తాజాగా షెర్లిన్ చోప్రా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. తనని శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్‌కుంద్రా మోసం చేశారని ఆరోపించింది.

Also Read : Manchu Vishnu : ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు మా విజయాన్ని గౌరవించాలి ‌‌- మంచు విష్ణు

అలాగే తనను మానసిక వేధించారని షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) పోలీసులకు తెలిపింది. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ రాజ్‌కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ షెర్లిన్‌ పోలీసులను కోరింది.

రాజ్‌కుంద్రాపై (Raj Kundra) పలు సంచలన కామెంట్స్ కూడా షెర్లిన్ చోప్రా చేసింది. రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్‌ డాన్‌తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారానే తనను బెదిరించారంటూ షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) ఆరోపించింది. రాజ్‌ కుంద్రాపై (Raj Kundra) పోర్నోగ్రఫీ కేసు నేపథ్యంలో ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోవాలని, లేకపోతే లైఫ్‌ మొత్తం నాశనం చేస్తామని బెదిరిస్తున్నారని షెర్లిన్ చోప్రా తెలిపింది.

Also Read : Mohan babu sensational comments: బెదిరించినా భయపడకుండా ఓటు వేశారు : మోహన్‌బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News