Leo:
ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా లియో. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జ, సంజయ్ దత్ కీలక పాత్రలలో కనిపించిన ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలై మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం గురించి ఒక షాకింగ్ ట్వెస్ట్ బయటపెట్టారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లియో సినిమా ప్రేక్షకులకి బాగానే నచ్చినప్పటికీ సినిమాలో లియో పాత్ర ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మాత్రం అభిమానులను నిరాశపరిచాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ కి బాగా నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లో సినిమా సినిమాటోగ్రాఫర్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
లియో ఫ్లాష్ బ్యాక్ అబద్ధం కూడా కావచ్చు అని చెప్పి మనోజ్ పరమహంస అభిమానులకి ట్విస్ట్ ఇచ్చారు. ఒక తెలియని వ్యక్తి (మన్సూర్) లియో పాత్ర గురించి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో నిజం లేకపోవచ్చు అని మనోజ్ అన్నారు. కొంతమంది మనోజ్ మాటలు నమ్ముతున్నప్పటికీ మరికొందరు మాత్రం నెగెటివిటీ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు.
అలా కాకుండా చిత్ర బృందం తమ తప్పుని ఒప్పుకుని ఫ్లాష్ ప్యాక్ బాలేదని అర్థం చేసుకునే ఉంటే బాగుంటుంది అని వారి అభిప్రాయం. ఒకవేళ ఫ్లాష్ ప్యాక్ అబద్ధం అయి ఉంటే అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించడంలో అసలు అర్థం ఏముంది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అబద్దం అయితే సినిమా ఆఖరిలో అయినా దాన్ని చెప్పి ఉండాల్సింది అని అంటున్నారు.
మరోవైపు లియో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 148 కోట్లు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సినిమా 220 కోట్ల గ్రాస్ కలెక్షన్ లోను అందుకుంది. మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని మిగతా సినిమాల గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Kalyan Ram Devil : నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook