Pushpa 2: ఎంతగానో ఆకట్టుకున్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీని వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఎవరంటే..!

Pushpa 2 pre-release event: చాలా కాలం తర్వాత నిన్న హైదరాబాద్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ అయినా కూడా దీనికి సంబంధించిన పనులన్నీ కేవలం ఒక్కరోజులో జరిగిపోయాయి అంటే మీరు నమ్మగలరా? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ విషయం గనుక ఒకే ఒక్క కారణం శ్రేయస్ మీడియా వారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 3, 2024, 07:21 PM IST
Pushpa 2: ఎంతగానో ఆకట్టుకున్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీని వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఎవరంటే..!

Pushpa 2 Wildfire Jathara: హైదరాబాద్ వంటి మహానగరంలో ఏదైనా ఈవెంట్ నిర్వహించడం అంటే చాలా కష్టమైన పని. అందులోనూ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా ఈవెంట్ అంటే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకి ఐదారు గంటల్లో అయిపోయే ఈవెంట్ అయినా కూడా.. దాని వెనుక ఎంతో మంది కష్టపడాల్సి ఉంటుంది. స్టార్ హీరో ఈవెంట్ అంటే వేల కొద్ది జనాలు వస్తారు.. అంత భారీ క్రౌడ్ మేనేజ్ చేయడం.. సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం.. ఇలా బోలెడు పనులు ఉంటాయి. 

ఇలాంటి భారీ ఈవెంట్లు నిర్వహించాలి అంటే రోజులకొద్దీ పని చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులన్నీ కేవలం ఒక్కరోజులో జరిగిపోయాయి అంటే మీరు నమ్మగలరా?

నిన్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ ను నిర్వహించింది శ్రేయాస్ మీడియా వారు. నిజానికి ఈ ఈవెంట్ కి పర్మిషన్ రావడం కష్టం అని అందరూ అనుకున్నారు కానీ శ్రేయాస్ మీడియా వారు ఈ ఈవెంట్ కోసం 24 గంటల్లో పర్మిషన్ తీసుకొచ్చి ఈవెంట్ చేసారు.

నిజానికి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఎక్కడా కూడా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్ జరగలేదు. సోమవారం ఈవెంట్ అంటే ఆదివారం రాత్రి ఈవెంట్ కి పర్మిషన్ వచ్చింది. సోమవారం నాటికి పాసుల ప్రింటింగ్ చేసి టీమ్ అంతా కష్టమైనా పరిస్థితుల్లో పని చేసి ఈవెంట్ ని చాలా బాగా నిర్వహించారు.

ఈవెంట్ మొత్తం మీద ఎటువంటి అనవసరమైన గొడవలు, ప్రమాదకరమైన సంఘటనలు లేకుండా ఈవెంట్ ని చాలా బాగా నిర్వహించారు శ్రేయాస్ మీడియా వారు. కాబట్టి ఈ ఈవెంట్ విజయానికి వెనుక క్రెడిట్ కచ్చితంగా వీరికే దక్కాలి. భారీ అంచనాల మధ్య పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.

Also Read: YS Sharmila: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి

Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..! .. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News