‘స్త్రీ ఎవ్వడికి దాసి కాదు’.. అదిరిపోయే డైలాగ్ తో ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ వచ్చేసింది

Shyam Singha Roy teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబరు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను ముమ్మరం చేసిన చిత్రబృందం.. గురువారం టీజర్ ను రిలీజ్ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 10:43 AM IST
‘స్త్రీ ఎవ్వడికి దాసి కాదు’.. అదిరిపోయే డైలాగ్ తో ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ వచ్చేసింది

Shyam Singha Roy teaser: ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు ఎంచుకొంటూ తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు నేచురల్‌ స్టార్‌ నాని. ఆయన హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ చిత్రానికి రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం ఏఎంబీ మాల్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం షేర్‌ చేసింది. నాని చెప్పిన బెంగాలీ డైలాగ్ తో టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.  ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్‌‌’’ అంటూ శ్యామ్‌సింగారాయ్‌ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. 

‘టక్‌ జగదీష్’ తర్వాత నాని నటించిన చిత్రమిదే. ఇందులో ఆయన శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలుగా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు.

Also Read: వెండితెరపైకి విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్.. హీరోగా అమీర్ ఖాన్?

Also Read: నాటు నాటు పాటకు హుక్ స్టెప్ సీక్రెట్ తెలుసా ? ఇదిగో ఈ ట్యుటోరియల్ వీడియో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News