Tillu Square: సిద్దు జొన్నలగడ్డ టిల్లుకి అసలేమైంది.. ఇలా ఉంటే కష్టమే అంటున్న అభిమానులు

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న టిల్లు స్క్వేర్ పై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2024, 08:00 AM IST
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ టిల్లుకి అసలేమైంది.. ఇలా ఉంటే కష్టమే అంటున్న అభిమానులు

Tillu Square Update: చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు‌. ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఆ చిత్రం చివరిలోనే సినిమాకి సీక్వెల్ ఉంది అంటూ హింట్ ఇచ్చారు చిత్రమే. ఇక అదే రుజువు చేస్తూ గత కొద్ది రోజుల క్రితం టిల్లు స్క్వేర్ అంటూ ఆ చిత్ర సీక్వెల్ ని సైతం ప్రకటించాడు.

అయితే ఈ రెండో భాగం షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక కష్టకాలం ఎదుర్కొంటూనే వస్తుంది. ఈ చిత్రంలో పలు మార్పుల వల్ల పలుసార్లు వాయిదాలు పడుతూ నత్తనడకగా షూటింగ్ షెడ్యూల్ ముగించుకుంది. సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి దర్శకుడు వరకు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతా వచ్చాయి. ఇక ఆ అడ్డంకులన్నీ దాటుకొని షూటింగ్ ముగించుకొని మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా విడుదల తేదీ విషయంలో కూడా కొన్ని వాయిదాలు పడగా.. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ మేకర్స్ ఫైనల్ గా ధ్రువీకరించారు.

అంటే ఈ సినిమా విడుదలకు ఇక కేవలం ఇంచుమించు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఎన్ని అడ్డంకులు దాటుకో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మరో సమస్య ఎదుర్కోక తప్పెది లేదనిపిస్తోంది. అదేమిటంటే సినిమాలకు ఎంతో ముఖ్యమైన ప్రమోషన్స్ ఈ చిత్రానికి లోపంగా కనిపిస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే ఈ సినిమా యూనిట్  ఇంకా చివరి నిమిషం ప్యాచప్ షూటింగ్ లో బిజీగా ఉన్నారట. అందుకే ఈ చిత్రం హీరో సిద్దు జొన్నలగడ్డతో సహా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా కూడా మొదలు కాలేదు.
ఒకటి రెండు రోజుల్లో ఈ చిత్ర ప్యాచప్ పూర్తవుతుందని అంటున్నారు కానీ ఆ వెంటనే బ్యాలన్స్ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా త్వరగా చేయాల్సి ఉంటుంది. పైగా సెన్సార్ ఫార్మాలిటీని కూడా ఈ సినిమా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ పనులన్నీ కూడా ఈ చిత్ర దర్శకుడితోపాటు సిద్దు జొన్నలగడ్డ ఇదంతా స్వయంగా చూసుకుంటున్నాడు అని వినికిడి.

మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాని కరెక్టుగా ప్రమోద్ చేసి ఇక 10 రోజుల్లో విడుదల చేయగలతాడా అనేది పెద్ద డౌట్. కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం ఈ విడుదల తేదీని అస్సలు వదులుకోకూడదు అనుకుంటున్నారట. ఎందుకంటే ప్రస్తుతంసుమారు నలభై రోజులకు పైగా బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని సరిగ్గా వాడుకుంటే కలెక్షన్ల మోత మోగుతుంది. అంతేకాకుండా ఈ విడుదల తేదీ వదులుకుంటే మరల ఇంత మంచి రిలీజ్ డేట్ త్వరలో అయితే లేదు. ఏప్రిల్ నెలలో ఫ్యామిలీ స్టార్ మే నెలలో కల్కి ఇక ఎలక్షన్స్ ఉండడంతో.. ఈ సినిమా మార్చ్ 29న విడుదల కావడం కలెక్షన్స్ పరంగా ఈ చిత్రానికి శ్రేయస్కరం.

మరి ఇలాంటి పరిస్థితుల్లో టిల్లు స్క్వేర్ ఇలా ప్రమోషన్స్ గురించి ఆలోచించకపోవడం చిత్రానికి సమస్య తీసుకురావచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సమస్యని సిద్దు జొన్నలగడ్డ.  ఇక టిల్లు స్క్వేర్ టీం ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x