Tillu Square Twitter Review: టిల్లన్న ట్రేడ్ మార్క్ కామెడీ.. టిల్లు స్క్వేర్‌ హిట్ కొట్టేసినట్లేనా..? ట్విట్టర్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఇదే..!

Tillu Square Review: టిల్లు స్వ్కేర్‌తో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు వచ్చేస్తున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్దూకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ నేడు ఆడియన్స్‌ ముందుకు వచ్చేసింది. మరి ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం పదండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 29, 2024, 09:52 AM IST
Tillu Square Twitter Review: టిల్లన్న ట్రేడ్ మార్క్ కామెడీ.. టిల్లు స్క్వేర్‌ హిట్ కొట్టేసినట్లేనా..? ట్విట్టర్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఇదే..!

Tillu Square Public Talk: డీజే టిల్లుతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ.. ఇండస్ట్రీకి సరికొత్త జోనర్‌ను పరిచయం చేశాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో సొంత పేరుతో కంటే సినిమా పేరుతో ఫేమస్ అయ్యాడు. అంతకుముందు ఇండస్ట్రీలో పదేళ్లు ఉన్నా నటుడిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన సిద్దు.. 2022లో డీజే టిల్లుతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాడు. ఇప్పుడు తాజాగా టిల్లు స్క్వేర్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. నేడు (మార్చి 29) టిల్లు స్క్వేర్‌ థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టాడు. ట్విట్టర్‌లో ఆడియన్స్‌ రెస్పాన్స్ ఎలా ఉంది..? సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు వస్తున్నాయి..? ఓ లుక్కేయండి.

టిల్లు స్క్వేర్‌తో సిద్దు మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడని టాక్ వస్తోంది. 'టిల్లు స్క్వేర్ ఈజ్ విన్నర్' అంటూ ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. టిల్లు స్టైల్‌లో భారీగా నవ్వించే సీన్స్‌ ఉన్నాయని చెప్పాడు. టిల్లు మేజిక్ సినిమా అంతా మళ్లీ రిపీట్ అయ్యిందన్నాడు. టిల్లన్న ఫన్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడంటూ రాసుకొచ్చాడు. 

 

 

 

"సిద్ధూ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ కామెడీతో అలరించాడు. సినిమాను వన్‌మ్యాన్ షోగా నడిపించాడు. కామెడీ చాలా వరకు వర్కౌట్ అయింది. అయితే కొన్నిసార్లు అనవసరంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ను కలిగిస్తుంది.." అని మరో నెటిజన్ ఫస్ట్ హాఫ్ గురించి రివ్యూ ఇచ్చాడు. 

 

సిద్దూ ఎనర్జీతో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేశాడని అంటున్నారు. రోలర్‌కోస్టర్ ఆఫ్ ఫన్ అని.. అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ బాగుందని మెచ్చుకుంటున్నారు. కొన్ని డిఫరెంట్ సీన్స్ ఉన్నా.. సినిమా చాలా ఆకట్టుకుంటుందని రివ్యూ ఇస్తున్నారు. వన్ టైమ్ వాచ్ కోసం పర్ఫెక్ట్ అని చెబుతున్నారు. మొత్తానికి ఓవర్సీస్‌ నుంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవ్వడం.. అందుకు తగినట్లే పాజిటివ్ రివ్యూస్ వస్తుండడంతో టిల్లు ఫ్యాన్స్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. మరి కాసేపట్లో ఫైనల్ రివ్యూలు రానున్నాయి.

 

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

Also Read:  RR vs DC Live: పరాగ్‌ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News