Sonu Sood Fathers Day Gift: సోనూసూద్ కుమారుడికి రూ.3 కోట్ల లగ్జరీ కారు కొనిచ్చాడా.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Sonu Sood Fathers Day Gift To his son : టాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూ.3 కోట్ల విలువైన కారును కుమారుడికి గిఫ్ట్‌గా ఇచ్చి ఫాదర్స్ డే సర్‌ప్రైజ్ తన కుమారుడికి ఇచ్చాడని కథనాలు వచ్చాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 21, 2021, 02:38 PM IST
Sonu Sood Fathers Day Gift: సోనూసూద్ కుమారుడికి రూ.3 కోట్ల లగ్జరీ కారు కొనిచ్చాడా.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Sonu Sood Fathers Day Gift: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయం నుంచి నేటి వరకు పేదల కోసం ఎంతో చేసిన నటుడు సోనూసూద్‌ దానకర్ణుడుగా మారిపోయాడు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ సామాన్యులతో పాటు టీమిండియా క్రికెటర్లకు సైతం తనకు తోచిన సాయాన్ని అందించాడు. సోనూ సూద్‌కు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూ.3 కోట్ల విలువైన కారును కుమారుడికి గిఫ్ట్‌గా ఇచ్చి ఫాదర్స్ డే సర్‌ప్రైజ్ తన కుమారుడికి ఇచ్చాడని కథనాలు వచ్చాయి. దీనిపై టాలీవుడ్ నటుడు సోనూసూద్ (Actor Sonu Sood) స్పందించాడు. స్పాట్‌బాయ్‌ఈతో మాట్లాడుతూ.. అది వాస్తవం కాదు. నా కుమారుడి కోసం నేను ఎలాంటి కారు కొనుగోలు చేయలేదు. టెస్ట్ డ్రైవ్ కోసం నేను ఇంటికి కారు తీసుకొచ్చాను. మేం ఎలాంటి కారును కొనుగోలు చేయలేదు. ఫాదర్స్ డే రోజు నా కుమారుడికి కారు ఎందుకు కొనిస్తాను. మరేదైనా బహుమతిగా ఇస్తానంటూ అసలు విషయాన్ని స్పష్టం చేశాడు.

Also Read: Fathers Day 2021 Wishes: తమ హీరోలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ సెలబ్రిటీలు

ఈ ఫాదర్స్ డే రోజు గిఫ్ట్ ఏంటంటే తన కుమారులతో సరదాగా సమయం గడిపాను. పిల్లలతో సంతోషంగా గడిపే క్షణాలన్నీ నాకు విలువైనవని సోనూసూద్ చెప్పుకొచ్చాడు. ఫాదర్స్ డే (Fathers Day 2021) సందర్భంగా కుమారుడు ఇషాంత్ సూద్‌కు నలుపు రంగు మెర్సిడేస్ మేబాచ్ జీఎల్ఎస్600ను తండ్రి సోనూసూద్ బహుమతిగా ఇచ్చాడని ప్రచారం జరిగింది. ఓ వీడియోను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. కానీ తాను అలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, కారు కొనుగోలు చేయలేదని, టెస్ట్ డ్రైవ్ కోసం ఇంటికి తీసుకెళ్లానని నటుడు వివరించాడు.

Also Read: International Yoga Day 2021 Images: భారత్‌లో ఇంటర్నేషనల్ యోగా డే 2021 ఫొటోస్ గ్యాలరీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News