Sreekaram Teaser: Farmer పాత్రలో శర్వానంద్.. ఆసక్తి రేకెత్తిస్తున్న dialogues..

Sharwanand's Sreekaram Teaser: శర్వానంద్ కొత్త సినిమా శ్రీకారం టీజర్ వచ్చేసింది. కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ ఓ రైతు పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకారం టీజర్ చూస్తోంటే... మహర్షి, భీష్మ చిత్రాల తరహాలో వ్యవసాయం అంటే ఏంటో మర్చిపోతున్న ఈ తరం వారికి వ్యవసాయంపై అవగాహన పెంచే లక్ష్యంతో తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. 

Last Updated : Feb 9, 2021, 11:43 PM IST
  • కొత్త డైరెక్టర్ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకారం మూవీ
  • వ్యవసాయం నేపథ్యంతో తెరకెక్కిన శ్రీకారం చిత్రంలో రైతు పాత్ర పోషించిన శర్వానంద్
  • మార్చి 11న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా శ్రీకారం టీజర్ విడుదల
Sreekaram Teaser: Farmer పాత్రలో శర్వానంద్.. ఆసక్తి రేకెత్తిస్తున్న dialogues..

Sharwanand's Sreekaram Teaser: శర్వానంద్ కొత్త సినిమా శ్రీకారం టీజర్ వచ్చేసింది. కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ ఓ రైతు పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకారం టీజర్ చూస్తోంటే... మహర్షి, భీష్మ చిత్రాల తరహాలో వ్యవసాయం అంటే ఏంటో మర్చిపోతున్న ఈ తరం వారికి వ్యవసాయంపై అవగాహన పెంచుతూ రైతుల కష్టాలను వెలుగులోకి తెచ్చే కథనంతో ఉంటుందని అనిపిస్తోంది. తినే వాళ్లు నెత్తి మీద జుట్టంత ఉంటే.. పండించే వాళ్లు మూతి మీద మీసం అంత ఉన్నారు అనే డైలాగ్ వింటే ఎవ్వరికైనా ఆ విషయం ఈజీగానే అర్థమవుతుంది. 

ఒక సినిమా Actor తన కొడుకును హీరోనే చేస్తాడు.. ఒక Doctor తన కొడుకుని డాక్టర్ చేస్తాడు.. ఒక Engineer తన కొడుకును ఇంజనీర్‌నే చేస్తాడు... కానీ ఒక రైతు మాత్రం తన కొడుకును రైతు చేయడు... ఈ ప్రశ్నే ఎంతకీ అర్థం కావడం లేదు అనే డైలాగ్ సినిమాలోని కథాంశం ఏంటనేది ఒక్క ముక్కలో చెబుతోంది. Janu movie తర్వాత రామ్ నటిస్తున్న సినిమా ఇదే. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న శ్రీకారం సినిమాలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించింది. Maha Shivratri కానుకగా మార్చి 11న Sreekaram movie release కానుంది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x