Sreeleela: మరోసారి రిపీట్ కానున్న హిట్ జోడి.. ఆ హీరోతో జట కట్టనున్న శ్రీలీల

Sreeleela Upcoming Movies: ఒకేసారి 9 సినిమాలకు పైగా ఆఫర్లు అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. అయితే ప్రస్తుతం మాత్రం శ్రీలీలాకి తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ మరోసారి హీరోతో నటించనుందని వార్త వినిపిస్తోంది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 27, 2024, 09:51 PM IST
Sreeleela: మరోసారి రిపీట్ కానున్న హిట్ జోడి.. ఆ హీరోతో జట కట్టనున్న శ్రీలీల

Sreeleela-Ravi Teja: రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ తో శ్రీలీల నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే శ్రీలీలని స్టార్ హీరోయిన్ గా మార్చిన చిత్రం మాత్రం రవితేజ హీరోగా చేసిన ధమాకా. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ తరువాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఆ సినిమాలో శ్రీలీల గ్లామర్, డాన్స్.. అని అప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆమె అభిమానులు కామెంట్లు పెట్టసాగారు.

దాంతో ఈ హీరోయిన్ కి ఒకేసారి 9 సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇలా ఒకేసారి ఎన్ని సినిమా ఆఫర్లు అందుకున్న హీరోయిన్ గా శ్రీ లీల సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రాలలో ఒకటి రెండు మినహా శ్రీలీలకి ఏ చిత్రం కూడా మంచి విజయం అందించలేకపోయింది. బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి తప్ప ఏ సినిమాలోనూ ఈ హీరోయిన్ కి.. నటనకు ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో శ్రీలీల కి తెలుగులో ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ హీరోయిన్ మళ్లీ ఒకసారి హీరోతో ఛాన్స్ అందుకుంది అనే వార్త వినిపిస్తోంది. 

అసలు విషయానికి వస్తే సామజవరగమన రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో.. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమాలో రవితేజ హీరోగా నటించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా చిత్ర యోని తెలియజేయలేదు. 2025 సంక్రాంతి విడుదలని ప్రాజెక్టు అనౌన్స్మెంట్ టైంలోనే.. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రకటించేశారు. ఇక అందుకోసం వీలైనంత త్వరగా షూటింగ్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం జూన్ లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మరి మొదటి షెడ్యూల్ లోనే శ్రీలీల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వచ్చు అని వార్తలకు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: IPL 2024 Prize Money: చాంపియన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు, రన్నరప్‌ హైదరాబాద్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News