Ustaad Movie: 'ఉస్తాద్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, నాని.. ఈవెంట్‌ ఎక్కడో తెలుసా?

Ustaad Movie: 'మత్తు వదలరా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహ నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్'. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ఫ్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు రాబోతున్నట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 12:51 PM IST
Ustaad Movie: 'ఉస్తాద్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, నాని.. ఈవెంట్‌ ఎక్కడో తెలుసా?

Ustaad Movie Pre-release event: లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యువ హీరో. ఆ తర్వాత శ్రీ సింహ చేసిన 'తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. లేటెస్ట్ గా ఆయన నటించిన చిత్రం 'ఉస్తాద్'(Ustaad Movie). ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కానుంది. 

మూవీ రిలీజ్ కు మరో రెండు రోజుల మాత్రమే ఉండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఆడియో ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి  చీఫ్‌ గెస్ట్‌గా న్యాచురల్ స్టార్ నాని(Nani) కూడా రానున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో  రజనీ కొర్రపాటి, రాకేశ్‌ రెడ్డి గడ్డం, హిమంక్ రెడ్డి దువ్వూరు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో  డైరెక్టర్ కమ్‌ యాక్టర్ గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి అకీరా బీ సంగీతం అందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. 

Also Read: Captain Miller Teaser: బిగ్‌ స్క్రీన్ పై ధనుష్ 'మిల్లర్ టీజర్'.. ఏకంగా 3500 థియేటర్లలో..

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తన కన్న కల కోసం, ప్రేమ కోసం ఫైట్ చేసే పాత్రలో శ్రీసింహ కనిపించబోతున్నాడు. బైక్ డ్రైవింగ్ అంటే ఒక ప్యాషన్ గా అనుకునే హీరో.. అదే ప్యాషన్ తో విమానం నడపాలనే గమ్యాన్ని ఎంచుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సన్నివేశాలను చాలా రియలస్టిక్ గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి శ్రీ సింహా ఈ సినిమాతోనైనా బ్రేక్‌ అందుకుంటాడేమో చూడాలి. ఆగస్టు 10న రజనీకాంత్ 'జైలర్', 11న మెగాస్టార్ 'భోళాశంకర్' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇద్దరు సూపర్ స్టార్ సినిమాల మధ్య శ్రీసింహ ఉస్తాద్ ఎంత వరకు నిలబడుతుందో వేచిచూడాలి. 

Also Read: Hidimba Movie: కౌంట్ డౌన్ స్టార్ట్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'హిడింబ'.. ఎక్కడ చూడొచ్చంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News