Rajamouli in Oppo Ad: తెలుగు సినిమాని గర్వించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డును గెలిచి తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత జక్కన్నకే చెందుతుంది. ఆయన సినిమా టేకాఫ్ చేశాడంటే హిట్ అవ్వాల్సిందే... కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క నటుడు కోరుకుంటారు. దర్శకధీరుడితో సినిమా చేస్తే ఎన్నో సినిమాల అనుభవాన్ని గడించవచ్చు.
ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న జక్కన్న ఇమేజ్ ను వాడుకుంటున్నాయి యాడ్ కంపెనీలు. తాజాగా ఒప్పో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు రాజమౌళి. తొలిసారి కమర్షియల్ యాడ్ లో నటించి ఆశ్చర్యపరిచాడు జక్కన్న. ఎప్పుడు సింపుల్ లుక్ లో కనిపించే జక్కన్న.. ఈ యాడ్ లో మాత్రం చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఒప్పో కొత్త మోడల్ రెనో 10 సిరీస్ ఫోన్ కోసం రాజమౌళి యాడ్ లో నటించారు. దీంతో ఆయన లుక్ చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం రాజమౌళి రూ.3 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దీని బట్టి రాజమౌళి రేంజ్ ఏంటో అర్థమవుతోంది.
@ssrajamouli brand new add for Oppo Reno 10 Series.#SSRajamouli #Oppo #HittuCinma pic.twitter.com/WWsNL22idm
— Hittu Cinma (@HittuCinma) June 28, 2023
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు. యాక్షన్ యాడ్వెంచర్ గా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. రాజమౌళి తండ్రి విజేయంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివరలో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్కిప్ట్ వర్క్ నడుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.
Also Read: Nagarjuna New Car: కొత్త కారు కొనుగోలు చేసిన నాగార్జున.. ధర ఎంతో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook