Megastar Chiranjeevi's Toyota Vellfire Hybrid Car Spefications: మెగాస్టార్ చిరంజీవి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అయినా ఖైరతాబాద్ ఆర్టీవోలో దర్శనమిచ్చారు. తాను కొనుగోలు చేసిన లగ్జరీ ఎంయువి కారు టయోటా వెల్ ఫైర్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడికి విచ్చేశారు. ఈ క్రమంలోనే 1111 నెంబర్ కోసం నాలుగు లక్షల డెబ్భై వేలు వెచ్చించి మరీ ఆ నెంబర్ దక్కించుకున్నారు. అయితే అసలు ఈ టయోటా వెల్ ఫైర్ కారు ఫీచర్లు తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయమే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ కారుని వాడుతున్నారు. ఇక ఈ కారుకు సంబంధించిన ఫీచర్లో ఒకసారి చూసేద్దాం పదండి.
మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు ఇదే కారుని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, హీరో నాగచైతన్య వాడుతున్నారు. ఈ ఇద్దరివీ బ్లాక్ కలర్ కారులే కాగా మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేసింది కూడా బ్లాక్ కలర్ కారే. ఇక టయోటా వెల్ ఫైర్ మన దేశంలోనే ప్రస్తుతానికి ఉన్న అత్యంత విలాసమయంతమైన కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారులో మొత్తం మూడు వరసల్లో సీట్లు ఉంటాయట. ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో ఉండే విలాసవంతమైన చైర్స్ లాగా ఈ సీట్లు ఉంటాయని, కావాలంటే వెనక్కి వాలే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అలాగే కాళ్లు రిలాక్స్డ్ గా ముందుకు పెట్టుకునేలా కూడా ఈ సీట్లకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రైవర్, పాసింజర్ సీట్లు రెండవ వరుసలో ఉన్న సీట్లలో స్ప్లిట్ బటన్స్, ఆర్మ్ రెస్ట్, సాఫ్ట్ రీడింగ్ లైట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Balagam Hero House: ఇల్లు షూటింగ్ కి ఇస్తే థాంక్స్ కూడా చెప్పలేదు.. వేణుపై ఇంటి ఓనర్ షాకింగ్ కామెంట్స్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీటింగ్ పొజిషన్లు సెట్ చేసుకోవడానికి రిమోట్ కంట్రోల్ సిస్టం అందుబాటులో ఉంటుంది. ఇక వెనక సీట్లలో కూర్చున్న వారి కోసం వీడియో స్క్రీన్, ఆడియో సిస్టమ్, ప్రైవసీ స్క్రీన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక కారు విశాలంగా ఉండటం వల్ల ఎక్కువ లెగ్ రూమ్ లభిస్తుంది. అదే విధంగా హెడ్ రూమ్ కూడా సరిపడినంతగా ఉంటుంది. లంబార్ సపోర్ట్ కూడా మిగతా కారులో పోలిస్తే ఈ కారులో ఎక్కువగా లభిస్తుంది. ఈ కారు లగ్జరీలో ఎంత స్పెషలో సేఫ్టీ లో కూడా అంతే స్ట్రాంగ్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్న వారిని సురక్షితంగా ఉంచేందుకు ఈ ఒక్క కారుకి 7 ఎయిర్ బ్యాగులు ఇస్తున్నారు.
ఇవి కాకుండా ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టం, పానిక్ బ్రేక్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ కూడా ఈ కారుకు అందిస్తున్నారు. ఇక పార్కింగ్ కోసం సెన్సార్ తో పాటు 360 డిగ్రీలు రొటేట్ అయ్యే కెమెరా కూడా అందుబాటులోకి వస్తోంది. ఇక ఈ కారు సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ సిస్టంతో పనిచేస్తోంది ఆటోమేటిక్స్ స్లైడింగ్ డోర్లు ఈ కారుకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. అంటే ఒక బటన్ నొక్కితే కారు డోర్లు వాటికవే తెరుచుకుంటాయి. మనం బలంగా చేతులతో లాగాల్సిన పని ఉండదు. ఇక ఈ మోడల్ కారు ఎలక్ట్రిక్ తో పాటు పెట్రోల్ తో కూడా నడిచే ఒక హైబ్రిడ్ మోడల్. ఇక ఈ కారు ఎక్స్ షోరూం ధర 90 లక్షలు కాగా ఆన్ రోడ్ ప్రైస్ కోటి పది లక్షల పై మాటే ఉంటుందని అంచనా.
ఇది కూడా చదవండి: Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook