చీఫ్ గెస్ట్‌గా కూతురు అల్లు అర్హ: అల్లు అర్జున్ ఏమన్నారంటే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

Last Updated : Mar 6, 2020, 09:01 AM IST
చీఫ్ గెస్ట్‌గా కూతురు అల్లు అర్హ: అల్లు అర్జున్ ఏమన్నారంటే!

హైదరాబాద్: త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరో నిఖిల్ లేటెస్ట్ సినిమా ‘18 పేజీస్‌’కు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ హాజరైంది. ఈ విషయంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. నిఖిల్ కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ.. తన కూతురు చీఫ్ గెస్ట్‌గా వెళ్లడాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావడానికి తనకు 23 ఏళ్లు పట్టగా, తన కూతురు మూడేళ్లకే చీఫ్ గెస్ట్‌గా వెళ్లిందని ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ బ్యూటీతో నాటీగా విజయ్ దేవరకొండ 

‘కుమారి 21 ఎఫ్‌’తో హిట్ కొట్టిన ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ‘18 పేజీస్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను డైరెక్టర్ సుకుమార్ అందిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా గోపి సుంద‌ర్ ఉన్నారు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ  

కాగా, నిఖిల్ కొత్త సినిమా ముహూర్తం ఈవెంట్‌కు అల్లు అర్హను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలు గురువారం (మార్చి 5న) నిర్వహించారు. తన తాతతో కలిసి ముఖ్య అతిథి అల్లు అర్హ తన సినిమా ముహూర్తం ఈవెంట్‌కు హాజరైందని హీరో నిఖిల్ ఓ వీడియో ట్వీట్ చేయగా, దీనిపై అల్లు అర్జున్ స్పందించారు.

రాహుల్ సిప్లింగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. వీడియో వైరల్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News