Rajinikanth: తీవ్ర అస్వస్థతకు గురైన రజినీకాంత్.. ఆసుపత్రిలో చేరిక..

Rajinikanth hospitalized:సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొత్తి కడుపుతో నొప్పితో ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ జాయిన్ అయినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 1, 2024, 07:40 AM IST
Rajinikanth: తీవ్ర అస్వస్థతకు గురైన రజినీకాంత్.. ఆసుపత్రిలో చేరిక..

Rajinikanth hospitalized:  సూపర్ స్టార్ రజినీకాంత్  తీవ్రమైన కడుపుతో నొప్పితో ఆసుపత్రిలో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు రజినీ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. అయితే రజినీ ఆసుపత్రిలో చేరడంపై అటు వైద్యులు, ఇటు కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మంగళవారం రజినీకి ఎలక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీ వయసు 73 యేళ్లు. కొన్నిరోజులుగా వేట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్‏లో నిర్విరామంగా  పాల్గొంటున్నాడు రజినీ కాంత్. దీంతో ఒక్కసారిగా అలసటకు గురికావడంతో ఆయన హాస్పిటల్ లో చేరారు.

ఇదిలా ఉంటే.. జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు.రజినీకాంత్ విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత కూతురు దర్శకత్వంలో ‘లాల్ సలాం’ మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా నడవలేదు. మరోవైపు రజినీకాంత్ హాస్పిటల్ చేరడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News