Trivikram - Sukumar: త్రివిక్రమ్ రూట్లో సుకుమార్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..

Trivikram - Sukumar: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్.. సుకుమార్ లది డిఫరెంట్ స్కూల్. ఎవరి రూట్లో వాళ్లు తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుకుమార్ .. త్రివిక్రమ్ ఏ రూట్లో వెళుతున్నాడో అదే రూట్లో తాను వెళుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 29, 2024, 08:04 AM IST
Trivikram - Sukumar: త్రివిక్రమ్ రూట్లో సుకుమార్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..

Trivikram - Sukumar: త్రివిక్రమ్ దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్.. హారికా హాసిని క్రియేషన్స్ లో పార్టనర్ గా ఉన్నాడు. అంతేకాదు నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ లో   తన భార్య సాయి సౌజన్య నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మాణ భాగస్వామిగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ కోవలో సుకుమార్ కూడా తన భార్య తబితను నిర్మాత లాంఛ్ చేస్తున్నాడు. అంతేకాదు ఆమె సమర్ఫణలో రావు రమేశ్ కథానాయకుడిగా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేస్తున్నాడు.
పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.  బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు.ఈ చిత్రంలో రావు రమేష్ సరసన ఇంద్రజ... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటించారు. హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.

మొత్తంగా త్రివిక్రమ్ రూట్లోనే సుకుమార్ తన సతీమణి తబితను ప్రొడ్యూసర్ ను చేసాడు. మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాతో తబిత సమర్పకురాలిగా తొలి చిత్రం కావడం విశేషం. కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ సినిమాను  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తున్నారు. ఆగస్టు 23న ఈ సినిమాను  భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేసాడు.

 

ఈ ట్రైలర్ విషయానికొస్తే.. మారుతి నగర్ లో ఉండే.. సుబ్రమణ్యానికి కాస్త వెటకారం ఎక్కువ. మార్నింగ్ కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి 'పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది' అని అడిగితే... 'గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను' అని కాస్త ఎటకారంగా చెబుతాడు. టైటిల్ రోల్ లో  రావు రమేష్ నటించాడు. హీరోగా అతనికిది ఫస్ట్ మూవీ.  ఆయన భార్యగా ఇంద్రజ  నటించారు. భర్త సిగరెట్లకు భార్య డబ్బులు ఇస్తోందని 'ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వను' అని ఇంద్రజ డైలాగ్ చెప్పడంతో అర్థం అవుతుంది. ఆ వెంటనే 'నీకు అదృష్టం ఆవగింజ అంత ఉంటే... దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు' అని అన్నపూర్ణమ్మ డైలాగ్ చెప్పడం నవ్విస్తుంది. ఆవిడ రావు రమేష్ అత్తగారి పాత్ర చేశారు. సుబ్రమణ్యం కుమారుడు ఏమో 'మా నాన్న అల్లు అరవింద్' అని గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. మొత్తంగా మారుతి నగర్ర సుబ్రమణ్యం ట్రైలర్ తో ఈ సినిమాపైఅంచనాలు పెంచేశారు. దీనికి సుకుమార్ బ్రాండ్ యాడ్ కావడం విశేషం.

ఈ సినిమా ఆ కంటెంట్ ఒక ఎత్తు అయితే... రావు రమేశ్ యాక్టింగ్ మరొక ఎత్తు. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో జీవించారు. 'అవన్నీ ఓకే' అని డైలాగ్ చెప్పడంలో, నుదుట నామాలు పెట్టి కుర్చీ తీసిన సన్నివేశంలో ఆయన చూపించిన యాటిట్యూడ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి సైతం తమ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. డైలాగులు బాగానే పేలాయి.  

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తో పాటు భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి అందించారు. ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ నిర్వహించారు. పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి అందించారు.  లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమిల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, సమర్పణ: తబితా సుకుమార్, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News