Rajinikanth Discharge: హాస్పిటల్ నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్.. ఊపిరి పీల్చుకుంటున్న తలైవా ఫ్యాన్స్..

Rajinikanth Discharge: రీసెంట్ గా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన రజినీకాంత్ .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. ఈ రోజు ఆయనకు సాధారాణ పరీక్షలు నిర్వహించిన తర్వాత చెన్నై అపోలో డాక్టర్లు  ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 4, 2024, 03:39 PM IST
Rajinikanth Discharge: హాస్పిటల్ నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్.. ఊపిరి పీల్చుకుంటున్న తలైవా ఫ్యాన్స్..

Rajinikanth Discharge: సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్రంగా అస్వస్థతకు గురికావడంతో రీసెంట్ గా హాస్పిటల్ పాలైన సంగతి తెలిపిందే కదా. గుండెకు సంబంధించిన ఇష్యూతో హాస్పిటల్ పాలైన ఆయనకు డాక్టర్లు స్టెంట్స్ వేసారు. అంతేకాదు మూడు రోజులు విశ్రాంతి తర్వాత ఈ రోజు ఆయన్ని హాస్పిటల్ నుంచి కాసేపటి క్రితమే డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు తెలిపారు.

రీసెంట్ గా  సూపర్ స్టార్ రజినీకాంత్  తీవ్రమైన కడుపుతో నొప్పి రావడంతో   చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే గుండెల్లో మంట రావడంతో ఆయన్ని వైద్యులు పరీక్షించి ఆయన గుండెకు స్టంట్స్ వేసారు.  రజినీకి ఎలక్టివ్ విధానానంలో డాక్టర్లు చికిత్స చేసినట్టు సమాచారం. ప్రెజెంట్ రజినీకాంత్ వయసు  73 సంవత్సరాలు. తలైవా కొన్ని రోజులుగా వేట్టాయన్, కూలి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండటం మూలానా అలసటకు గురి కావడంతో ఆయన హాస్పిటల్ లో చేరారు.  

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

రజినీకాంత్ చిత్రాల విషయానికొస్తే.. జై భీమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్‌ డైరెక్షన్ లో  ‘వేట్టయాన్’ మూవీ చేసాడు. ఈ సినిమా ఈ నెల  10 ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ సుభాస్కరన్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.  ఈ మూవీలో ఇతర ముఖ్య పాత్రల్లో  అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్,మంజు వారియర్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి  అనిరుధ్ సంగీతం సమకూర్చారు. రజినీ ఈ చిత్రంతో పాటు  లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో  నాగార్జున విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. రజినీకాంత్ విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో  మంచి హిట్ అందుకొన్నాడు. అంతేకాదు తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తలైవా కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత కూతురు  డైరెక్షన్ లో చేసిన‘లాల్ సలాం’ మూవీ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా రజినీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News