Rajinikanth Birthday: స్టైల్ అనే పదం రజినీకాంత్ ని చూసే పుట్టిందేమో అనిపించక మానదు. మనల్ని అంతలా తన స్టైల్ తో ఆకట్టుకున్నాడు సూపర్ స్టార్. రజినీకాంత్ స్క్రీన్ పైన నడుస్తూ ఉంటే చాలు…ఓ లెవల్లో విజిల్స్ పడడం ఖాయం. దాన్ని బట్టి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ కి ప్రతి దేశంలోనూ అభిమానులు ఉన్నారు. అలాంటి రజినీకాంత్ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీ కోసం…
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే ఒక పాట మనందరికీ గుర్తుందే ఉంటుంది. ఆ పాటకి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన సూపర్ స్టార్..రజినీ చేసిన మొదటి ఉద్యోగం బస్ కండక్టర్. ఆ పనిలో ఆయనకు వచ్చిన మొదటి జీతం నెలకు రూ.750. ఆ సంపాదనతోనే తన జీవితాన్ని ప్రారంభించారు మన సూపర్‌స్టార్.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థం అందులో ఉంది…ఈ పాటకి కూడా మన సూపర్ స్టార్ ఒక ఉదాహరణ. గుడిలో కూర్చున్నప్పుడు మనల్ని ఎవరన్నా యాచకులుగా భావించి చేతిలో రూపాయి మనం ఎలా స్పందిస్తాం?? ఎలాంటి వారైనా సరే కోప్పడతారు కదూ! కానీ రజినీ మాత్రం అలా చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో నవ్వుతూ వదిలేశారు. ఓ సారి బెంగళూరులోని ఓ దేవాలయంలో మన సూపర్ స్టార్ కి ఈ అనుభవం ఎదురయింది
రజిని గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఎంత రాసిన తక్కువే. పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు రజినీకాంత్. సీబీఎస్‌ఈ ఆరోతరగతి పాఠ్యాంశాల్లో 'ప్రమ్ బస్ కండక్టర్ టూ సూపర్‌స్టార్' పేరుతో ఆయన జీవితమే ఓ పాఠంగా చేసి స్కూల్ పిల్లలకు చెప్పే స్టేజ్ కి ఎదిగాడు మన సూపర్ స్టార్.
కేవలం మన రజినీకాంత్ నటనతోనే కాకుండా రచయితగానూ మెప్పించారు. వల్లీ అనే సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. అంతేకాకుండా ఈ సినిమాలో అతిథి పాత్రలోనూ మెరిశారు.
ఒక భాషలో అభిమానులు ఉండడం సహజం. లేదా తమ దేశంలో అభిమానులు ఉండడం సహజమే. కానీ రజినీకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. జపాన్‌లో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. మన హీరోలు మన రాష్ట్రాలలో ఎంత కలెక్షన్స్ సొంతం చేసుకుంటారు రజిని ఇతర దేశాలలో కూడా అంత కలెక్షన్స్ దక్కించుకుంటారు. ఆయన చేసిన ముత్తు సినిమా ఇప్పటికీ అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి