Akhanda OTT streaming: నందమూరు నట సింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna latest movie) హీరోగా నటించిన 'అఖండ' సినిమా.. గత ఏడాది డిసెంబర్2న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ హ్యాట్రిక్ (Akhanda Movie success) కొట్టినట్లైంది.
ఈ మూవీ దాదాపు రూ.150 కోట్లు వసూళ్లు సాధించిది. కొవిడ్ భయాలు కొనసాగుతున్న సమయంలోనూ భారీ వసూళ్లు రాబట్టి.. పెద్ద సినిమాలన్నింటికి (Akhanda Movie Collections) ఆశాకిరణంగా నిలించింది.
ఇంకా చెప్పాలంటే.. గత ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో పెద్ద తెలుగు సినిమా 'అఖండ' కావడం విశేషం. మొదటి స్థానంలో అల్లు అర్జున్ నటించిన (Biggest Hit Telugu Cinema in 2021) పాన్ ఇండియా సినిమా 'పుష్ప' నిలిచింది.
అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన బాలయ్య ఫ్యాన్స్‌కు నేటి నుంచి ఆ సంతోషం రెట్టింపు కానుంది. ఎందుకంటే.. 'అఖండ' సినిమా నేడే ఓటీటీలో (Akhanda OTT release) విడుదలవనుంది.
కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారందరికి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. దీనితో పాటు బాలయ్య సినిమా మళ్లీ మళ్లీ చూడాలనుకునే అభిమానులకు కూడా ఇది మంచి వార్తే.
ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్.. 'అఖండ' మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచే (జనవరి 21) స్ట్రీమింగ్ చేయనుంది. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీవి చూసేందుకు (Akhanda OTT streaming time) వీలుంది.
అఖండ మూవీ స్ట్రీమింగ్ రైటన్స్ను హాట్‌స్టార్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు (Akhanda in Disney Hotstar) అంచనాలున్నాయి.
Chudu... #Akhanda ni @DisneyPlusHS lo chudu. Inkekkada chudalanukoku.. Thattukolevu 🔥
World Digital Premiere on @DisneyPlusHS from Jan 21st at 6 pm.#AkhandaOnHotstar #NandamuriBalakrishna#BoyapatiSreenu @ItsMePragya @dwarakacreation @DisneyPlusHSTel#WatchAkhandaCatchBalayya pic.twitter.com/1ngzi9KyZJ— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) January 20, 2022
అఖండ సినిమా గురించి..
ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించారు. కొత్త లుక్‌లో బాలకృష్ణ పేల్చే మాస్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal in Akhanda) హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎం రత్నం డైలాగ్స్ అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ (రూ.60-70 కోట్లు)తో ఈ సినిమాను (Akhanda movie Budget) తెరకెక్కించారు.
Also read: Sam-Chai divorce: సమంత, నాగచైతన్య మళ్లీ ఒక్కటవుతున్నారా.. అందుకే సామ్ అలా చేసిందా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook