Hide N Seek Trailer Lauch Event: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్ హీరోహీరోయిన్స్‌గా దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో రూపొందిన సినిమా హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహణకు అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని.. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.
Also Read: Devara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారి
హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ మూవీ ప్రతి ఒక్కరిని థ్రిల్‌కు గురిచేస్తుందన్నారు. కచ్చితంగా థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు. మరో హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ.. ఈ నెల 20న తమ సినిమా థియేటర్లోకి రాబోతుందని.. అందరూ చూసి ఆదరించాలన్నారు. ప్రతి ఒక్కరిని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందన్నారు. డైరెక్టర్ బస్సురెడ్డి రానా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆద్యాంతం కట్టి పడేసే అద్భుతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరిని కచ్చితంగా అలరిస్తుందన్నారు.
చివరగా హీరో విశ్వంత్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని.. ఇలాంటి ఎనర్జీనే తమ సినిమాకు అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. తమ సినిమానికి ఎక్కడికి వెళ్లినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని.. ఆ వైబ్‌తోనే ఈ నెల 20న థియేటర్లలో కలుసుకుందామన్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ కంప్లీకేటెడ్ మర్డర్స్ కేసులను పోలీసులు ఎలా ఛేదించారనే ఇండ్రెస్టింగ్ పాయింట్‌తో రూపొందించినట్లు అర్థమవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ప్రతి సీన్‌ను ఇంట్రెస్టింగ్గా మలిచినట్లు తెలుస్తోంది. లిజో కె జోష్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్‌గా చిన్న రామ్ పనిచేశారు. ఎడిటింగ్ బాధ్యతలను అమర్ రెడ్డి కుడుముల నిర్వర్తించగా.. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు.
Also Read: TG High court: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు.. కీలక తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.