Swatantrya Veer Savarkar trailer talk Review: బాలీవుడ్‌లో 'స్వతంత్య్ర వీర్ సావర్కర్' బయోపిక్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్..

Swatantrya Veer Savarkar trailer talk Review: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో వస్తోన్న మరో సంచలనాత్మక చిత్రం 'స్వతంత్య్ర వీర సావర్కర్'. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పోరాడిన అసుల సిసలు పోరాట యోధుడు.. బ్రిటిష్ వాళ్ల చేత రెండు యావజ్జీవి శిక్షలు అనుభవించిన ' వినాయక్ దామోదర సావర్కర్'. ఈయన్ని వీర సావర్కర్‌గా పిలుస్తారు. తాజాగా ఈ బయోపిక్‌కు చెందిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 5, 2024, 07:12 PM IST
Swatantrya Veer Savarkar trailer talk Review: బాలీవుడ్‌లో 'స్వతంత్య్ర వీర్ సావర్కర్' బయోపిక్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్..

Swatantrya Veer Savarkar trailer talk Review: దేశానికి స్వాతంత్య్రం గాంధీజీ గారు బోధించిన అహింసతో రాలేదు. సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ చేసిన పోరాటల ఫలితంగానే మనకు స్వతంత్య్రం సిద్ధించింది. మనకు స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటికే సావర్కర్ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. భరత మాత దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి విదేశాల్లో ఉంటూ తిరుగుబాటు చేసిన యోధుడు. అంతేకాదు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎంతో మంది నాయకుల్లో స్పూర్తి నింపింది వినాయక్ దామోదర్ సావర్కర్. లండన్‌లో ఉంటూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు. అంతేకాదు బ్రిటిష్ వాళ్ల చేత రెండు యావజ్జీవి శిక్షలు పొందిన ఏకైక స్వాతంత్ర్య యోధుడు. ఆయన జీవితాన్ని వెండితెరపై హీరో రణదీప్ హుడా ఆవిష్కరించారు. ఆ మహనీయుడు పాత్రలో ఒదిగిపోయాడు. అప్పటి దేశ కాలామాన పరిస్థితులను తన సినిమాలో చూపెట్టాడు.

అప్పటి స్వాంతంత్య్ర వీరుల ఎలా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది.ఆపై కాలాపానీ (అండమాన్ జైల్లో) శిక్ష అనుభవించాడు. ఈ సందర్భంగా జైల్లో ఇరుకు గదుల్లో ఉంటూ గానుగ తిప్పుతూ.. తన కవితలను గోడలపై మేకులతో రాయడం వంటి ఎవరు అనుభవించని శిక్షలను అనుభవించాడు. ఈ సినిమాను వీర సావర్కర్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరించారు. ముఖ్యంగా సావర్కర్ తీవ్ర శిక్ష అనుభవించిన సావర్కర్ జైలును ఒకపుడు సెల్యూలర్ జైలుగా వ్యవహరించేవారు. దీనికి మరో పేరు కాలా పానీ. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన అసలు సిసలు దేశ భక్తుడి కథ వెండితెరపై ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూదాదలి.

ఇక దేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసారు. అందులో మన దేశ ప్రజలకు  గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్, ఆజాద్, భగత్ సింగ్ వంటి వారు మాత్రమే తెలుసు. కానీ ఈ మహానుభావులతో పాటు స్వతంత్య్ర సంగ్రామంలో సమిదలైన వాళ్లు కోకొల్లలు. అందులో వినాయక్ దామోదర్ సావర్కర్ ఒకరు. ఈయన జీవితంలో ప్రధాన ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక హిందూత్వ అనేది ధర్మం కాదు.. ఇతిహాసం అంటూ చెప్పిన మహనీయుడు. మరి సిల్వర్ స్క్రీన్ పై ఈ నెల 22న రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు వేదికగా నిలుస్తుందో చూడాలి.

Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!

 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News