Taapsee Pannu:తాప్సీకి పెళ్లయిపోయిందా? బయటపడుతున్న షాకింగ్ నిజాలు

Taapsee Pannu Secretly Married: తాప్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అయితే తాజాగా తాప్సీ ఎవరికి చెప్పకుండా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2024, 01:03 PM IST
Taapsee Pannu:తాప్సీకి పెళ్లయిపోయిందా? బయటపడుతున్న షాకింగ్ నిజాలు

Taapsee Pannu Married to Mathias Boe:
తెలుగు సినిమాలతో తన సినీ రంగ జీవితాన్ని మొదలుపెట్టిన తాప్సీ.. టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు అందుకుంది. తాను ఎంచుకున్న సినిమాల వల్ల అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగదమే కాదు.. నటన పరంగా మంచి పేరు కూడా తెచ్చుకుంది.

ఇప్పటికి కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. అందరికీ షాక్ ఇస్తూ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది అన్న వార్త వైరల్ అవుతోంది. తాప్సీ పది సంవత్సరాల నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఎన్నోసార్లు మీడియాలో ప్రచారం అయిన కానీ తాప్సీ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు.

కానీ కొద్ది నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ని  తాప్సీ పెళ్లి చేసుకోబోతుందన వార్తలు గట్టిగా వినిపించగా.. అప్పుడు మీడియా తాప్సీ ని ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి అడిగింది. అప్పుడు కూడా తాప్సి తన పర్సనల్ విషయాలు చెప్పడం ఇష్టం లేదు అంటూ ఆ విషయాన్ని దాటేసింది. కాగా కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి రూమర్స్ ని మరింత బలపరిచింది ఈ హీరోయిన్.

ఈ క్రమంలో తాజాగా తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు బాలీవుడ్ సమాచారం. ప్రముఖ మీడియా న్యూస్ 18 సమాచారం ప్రకారం మథియాస్ బోయ్ తొ తాప్సీ వివాహం ఉదయ్ పూర్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో రెండు రోజుల క్రితమే జరిగినట్టు సమాచారం. సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, తన సన్నిహితుల మధ్యే తాప్సీ వివాహం చేసుకుందట.

తాప్సీ కి సన్నిహితులు అయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు పావైల్ గులాటి, అనురాగ్ కశ్యప్, కనికా థిల్లాన్.. పలువురు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కనికా, పావైల్ ఓ పెళ్ళికి హాజరైనట్టు ఫోటోలు షేర్ చేసారు కానీ అది ఎవరి పెళ్లి అనేది చెప్పలేదు. అయితే ఈ ఫోటో తాప్సి పెళ్లి సంబరాల్లో తీసుకున్న ఫోటోనే అని తెలుస్తోంది.
 

 

 
 
 
 
 

అయితే దీనిపై హీరోయిన్ తాప్సీ ఇంకా ఎటువంటి  అధికారిక ప్రకటన లేదు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటపడితే.. లేదా వీరే స్వయంగా చెబితే తప్ప తాప్సీ పెళ్లిపై క్లారిటీ రాదు. కాగా మథియాస్ బోయ్ 2012 ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన కోచ్ గా పనిచేస్తున్నాడు. మరోపక్క తాప్సీ పలు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ

Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News