Bandla Ganesh counter to Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా 'లైగర్' తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. లైగర్ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో లైగర్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది.
లైగర్ ట్రైలర్ రిలీజ్ అనంతరం విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'ఈ గోలలో మీకేమైనా వినిపిస్తుందా. నీ యమ్మా ఇందిరా ఈ మెంటల్ మాస్. నాకు అసలు ఏం మాట్లాడా అర్ధం అయితలేదు ఈ రోజు. మీకు మా అయ్య తెల్వడు, మా తాత తెల్వడు, ఎవ్వడూ తెల్వదు.. రెండేళ్లు అవుతుంది నా సినిమా రిలీజ్ అయి. అంతకుముందు సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయనా?. మీ అభిమానంను ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ. బాడీ, ఫైట్స్, డ్యాన్స్ చేసింది మీ కోసమే. ఆగస్టు 25న ఇండియా షేక్ అవ్వడం గ్యారెంటీ' అని అన్నాడు.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022
లైగర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దేవరకొండ మాట్లాడిన మరుసటి రోజే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి అని పేర్కొన్నారు. 'తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లాగా. గుర్తుపెట్టుకో బ్రదర్' అని బండ్ల గణేష్ ట్వీటారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు దేవరకొండకు బండ్ల కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.
Also Read: కొలెస్ట్రాల్ పెరిగితే.. శరీరంలోని ఈ భాగాలు ముందే సంకేతాలు ఇస్తాయి! పొరపాటున కూడా విస్మరించవద్దు
Also Read: Kaleshwaram Project:కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు.. సీఎం కేసీఆర్ అంత పని చేశారా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.